ప్రార్థన

ఆత్మఫలము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పరిశుద్ధాత్మను పొందుకొని ఎదుగుచున్నవారు ఫలించే ఫలము ఆత్మఫలము. ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమియు లేదు. -గలతీ 5:22,23
మారుమనసు పొందుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీస్మము పొందుకున్నవారు, మారుమనసుకు తగిన ఫలం ఫలించాలి, ఫలించకపోతే ఉపయోగముండదు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది. గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేనికైన చివరగా ఫలమే ముఖ్యము. మనము చేసే ప్రతి పని ఫలభరితము కావాలని కోరుకుంటాము గదా! అలాగే దేవుడు కూడా మనము ఫలించాలని కోరుకుంటాడు. అది బహుగా ఫలించాలని. వాస్తవానికి ఆ ఫలాలు ఇచ్చేది దేవుడే. అయితే ఆయనలో అంటుకట్టబడి, ఆయన వాక్యానుసారముగా నడుచుచు ఆయనతో ఎడతెగని సహవాసము కలిగి ఉండటమే మన పని. నా యందు నిలిచియుండుడి. మీ యందు నేనును నిలిచి యుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి యుంటేనే గానీ మీరు ఫలింపరని ప్రభువు సెలవిస్తున్నాడు. -యోహాను 15:4.
మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురని యేసు ప్రభువు మాట - యోహాను 15:8. బహుగా ఫలించటము గానీ, ఫలించటము గానీ మన కోసము కాదు. కేవలము తండ్రి మహిమ కొరకే. తోట ఫలము తోటకు కాదు తోట యజమానుని కోసమే. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అందుకే మనము ప్రభువు నందే అతిశయించాలి. మనము ఏది చేసినా ప్రభువుకు మహిమ రావాలి. అదే మనకు ఆశీర్వాదము. స్వంత మెప్పు కోసం ఫలించే ఫలము, ప్రభువుకు మహిమను ఇవ్వని ఫలము ఆత్మఫలము కాదు. అది దేవునికి ఇష్టముండదు. మనకు ఆశీర్వాదముండదు.
మోసపోవద్దు. దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తుదురో ఆ పంటనే కోయుదురు. ఏలయనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంట కోయును. అది మంచి హోదా కావచ్చు. ఆస్తి ఐశ్వర్యము అవ్వచ్చు. ధనధాన్యాదులు.. ఇంకా ఏదైనా మనము ఈ లోకములో చాలా గొప్పది అనుకునేది కావచ్చు. అన్నీ క్షయమయ్యేవే. శరీరానుసారమైన పంట ఉండేది కాదు. అది క్షయమైనది. ఆత్మనుబట్టి విత్తువాడే ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును - గలతీ 6:7,8.
చాలావరకు మనుషులు దేవుని మాటలు ఇష్టపడతారు. దేవుని ఆశీర్వాదాలు కావాలి. స్వస్థతలు కావాలి. కానీ వాటిని దయచేసిన దేవుడు మాత్రము వద్దు. ఇది కాని పని. ఎందుకంటే దేవుడు మనలను తనలో నిలిచి ఉండమంటున్నాడు. తనలోనే ఉండమంటున్నాడు. ఆయనలో నిలిచి ఉంటేనే ఫలించగలమని చెప్పుచున్నాడు. ఆయనలో నిలిచి ఉంటేనే బహుగా ఫలించగలము. వేరుగా ఉంటే ఎండిపోతాము. ఇది మనకు తెలిసిన సత్యము. కొమ్మను చెట్టు నుండి వేరుచేస్తే అది కొన్ని రోజులకు ఎండిపోతుంది. ఇంకొక విషయం - క్రీస్తులో ఉండి బహుగా ఫలించి, ఫలాలు నా నుంచే అనుకుంటే అది పొరపాటే. అలా అనుకొని వేరుగా ఉండిన ఫలించగలను అనుకొని వేరైన వారూ ఉన్నారు. జాగ్రత్త. మన జీవం క్రీస్తులో ఉంది. క్రీస్తులో అంటుకట్టబడితేనే, క్రీస్తులో నిలిచి యుంటేనే, అంటే ఆయన మాటలలో నిలిచి యుంటేనే మనము ఫలిస్తాము. లేకపోతే ఎండిపోయి బయట పారవేయబడి అగ్నిలో కాలిపోవల్సిందే.
ఆత్మవరాల కన్నా ఎక్కువ ఆపేక్షించవలసినది ఆత్మఫలము. దానిలో ముఖ్యమైనది శ్రేష్ఠమైనది ప్రేమ. మనము కూడా ప్రేమిస్తాము కానీ తాత్కాలికమైన ప్రేమ. కానీ ఆత్మఫలములో ఉన్న ప్రేమ మారనిది. అది దేవుని ప్రేమ. ఇది దీర్ఘకాలము సహించును. మత్సరపడదు. డంబముగా ప్రవర్తింపదు. ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నందు సంతోషించును. అన్నిటిని తాళుకొనును. అన్నిటిని నమ్మును. అన్నిటిని నిరీక్షించును. అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును. ఈ ప్రేమ లేకుండా మనుషుల భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా ఉపయోగము లేదు. ప్రవచించే కృపావరము కలిగినా మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినా, కొండలను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థమే. బీదల పోషణ కొరకు ఆస్తి అంత ఇచ్చినా కాల్చబడుటకు శరీరాన్ని ఇచ్చినా ప్రేమ లేకపోతే ప్రయోజనము లేదు.
దేవుని ప్రేమ ఆకాశము కంటె ఎతె్తైనది. దానిని చేరలేము కానీ ఆయన ప్రేమలో వేరు పారాలి. ఆయన మనకు శిరస్సై ఉండాలి. అప్పుడే జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ హృదయములకు తలంపులకు కావలి ఉండి మనతో కూడా ప్రేమ ఫలిస్తుంది.
క్రీస్తు ప్రేమ ఎంత బలమైనదంటే శ్రమయైనా బాధయైనా ఉపద్రవమైనా కరవైనా వస్త్ర హీనతయైనా హింసయైనా ఖడ్గమైనా మనలను ఎడబాపనేరవు. మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవియైనా రాబోవునవైనా అధికారులైనా ఎతె్తైనా లోతైనా సృష్టింపబడిన మరి ఏదైనను మనలను వేరు చేయలేనంత శక్తి గలది. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనము తెలిసికొనగలము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై యున్నాము.
దేవుడు ఇంతగా మనలను ప్రేమిస్తుంటే, మనమేమో మనుషులు నన్ను పట్టించుకోవటం లేదు, నన్ను ప్రేమించటం లేదు అని ఆలోచిస్తూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ప్రభువు ప్రేమను మరచి వాళ్లు పట్టించుకోవటం లేదు వీళ్లు పట్టించుకోవటం లేదు అనే బాధలో దిగులుగా ఉంటాము. వాళ్లు ప్రేమించటము లేదు గనుక నేను కూడా ప్రేమించను. నేనెందుకు ప్రేమించాలి. నేను అంత లోకువయ్యానా అసలు నేనంటే ఏమనుకుంటున్నారు అన్నట్టుగా చాలామంది ఉన్నారు. అయితే గమనించాలి. దేవునితో పోలిస్తే మనిషి దుమ్ము ధూళి వంటివాడు. ఈ దుమ్ముధూళి లాంటి మనిషి ప్రేమ ఎంత ఉంటుంది దేవునితో పోలిస్తే. చాలా స్వల్పము. అయినా ఈ స్వల్ప ప్రేమ చూపించలేదని, దేవుని అపారమైన ప్రేమకు దూరవౌతున్నారు. అలానే హవ్వ ఆదాము చిన్న పండు కోసం ఏదేను వనాన్ని పోగొట్టుకున్నారు. చిన్న విషయాల కోసం దేవుని అపారమైన ప్రేమను పోగొట్టుకొనవద్దు. ఆయన ప్రేమలో వేరుపారి ఆయన ప్రేమతో నింపబడి ఆ ప్రేమను లోకానికి చూయించి దేవునికి మహిమ తెచ్చేవారముగా ఉండాలని ఆశ. ఆత్మఫలములో మొదటిది గొప్పది ప్రేమ. ఈ ఆత్మఫలము నుండి వచ్చే ప్రేమ లేకపోతే ఇక ఎన్ని గొప్ప కార్యములు చేసినా వృధానే అంటున్నాడు పౌలు. ప్రభువు ప్రేమయై ఉన్నాడు గనుక మనము కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి. ఇక లోకములో ఏ విషయములో ఈ ప్రేమను వదలకూడదు. ఆదిలో ఏదేను వనములో వదలినట్లు అవుతుంది.
సంతోషము: దేవుడిచ్చే సంతోషము. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి యున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. అయితే ప్రభువిచ్చిన సంతోషాన్ని ఎవరూ మన నుండి తీసివేయలేరు. పరిపూర్ణ సంతోషమిస్తాడు. అంధకారమయములో ఉన్న భూమిని వెలిగించటానికి క్రీస్తేసు ఈ లోకానికి వచ్చాడు. చీకటిలో సంచరించే సమయములో వెలుగు వస్తే వచ్చే సంతోషము ఆయనను స్వీకరించిన వారందరికీ కలుగుతుంది. అటువంటి సంతోషమిచ్చే వెలుగును పొందిన మనము వెలుగు ప్రకాశించాలి. ఆ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది - ఎఫెసి 5:9. దేవుని రాజ్యము నీతి సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది - రోమా 14:17.
లోకము ఇచ్చే సంతోషము బాహ్య ప్రపంచములో ఉన్న పరిస్థితినిబట్టి ఉంటుంది. కానీ దేవుని సంతోషము నిత్యసత్యాల మీద ఆధారపడి ఉంటుంది.
సమాధానము: సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము - లూకా 2:14. దేవుడు ఇచ్చే సమాధానము వలన ఈ లోకములో మనకు కలవరముండదు. ఈ సమాధానము లేక మనుషులు స్థలాలు మారుస్తారు. సిటీలు మారుతారు. దేశాలు మారుస్తారు. కానీ ప్రభువిచ్చే సమాధానము మనము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది.
దీర్ఘశాంతము: ఈ రోజుల్లో శాంతమే లేదు. ఇక దీర్ఘశాంతమెక్కడ? హోటల్లో ఆర్డర్ ఇచ్చి వారు తెచ్చే సమయంలో కూడా శాంతముండుట లేదు. శాంతములో సుఖముంది. అది కూడా ఆత్మఫలమే. సంసారము సుఖముగా ఉండాలంటే సూత్రము శాంతమే. మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతారు. శాంతముతో చేస్తేనే పనులు విజయాన్ని సాధిస్తాయి.
దయాళుత్వము: ప్రభువు మన మీద చూపిన దయను మనము కూడా ఇతరుల మీద చూపాలి. మన మంచి కాదు గానీ కేవలము ఆయన దయ వల్లనే మనము ఇలా ఉన్నాము గనుక దయ కలిగి ఉండాలి.
మంచితనము: మంచే లేని మనపైన ప్రేమను చూపిన ప్రభువు మంచితనము మనము కలిగి ఉండాలి. మనకు మనం మంచి అనుకుంటే కాదు దేవుని దృష్టిలో మంచితనముగా ఉండాలి.
విశ్వాసము: విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పరుగు పందెములో ముందుకు సాగాలి. దేవునిపై విశ్వాసము కలిగి ఉండుట కూడా అది దినదినము పెరగటానికి కూడా పరిశుద్ధాత్ముడే కారణము. మన మీద ఉంచిన నమ్మకాన్ని నిరూపించాలి. అప్పుడే భళా మంచి నమ్మకమైన దాసుడా అని మనకు మెప్పు కలుగుతుంది. మరణము వరకు నమ్మకముగా ఉండుము. జీవ కిరీటము లభించును.
సాత్వీకము: క్రీస్తు సాత్వీకము మనము కూడా కలిగి ఉండాలి.
ఆశానిగ్రహము: నిగ్రహం లోపించిన ఈ దినాలలో ఇది నిజముగా మనకు ఒక వరము. దీని ద్వారా ఎంతో మేలు కలుగుతుంది.
పరిశుద్ధాత్మ ఫలము ద్వారా అందరము ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలని ప్రార్థన.

-మద్దు పీటర్ 9490651256