ప్రార్థన

శోధన జయించిన క్రీస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా సాతాను ఆయన యొద్దకు వచ్చి - నీవు దేవుని కుమారునివైతే ఈ రాళ్లు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. శరీర ధారియై ఈ లోకములోనికి వచ్చిన యేసు ప్రభువుకు - పుట్టినప్పటి నుండి శోధనలు ఎదురౌతూనే ఉన్నాయి. అవి చిన్నవి కావొచ్చు. పెద్దవి కావొచ్చు. వాటినన్నిటిని జయించి మనకు ఒక మాదిరిని చూపించాడు ప్రభువు’ - మత్తయి 4:2-10.
ఆయన ఆకలి గొనగా - ఆకలిలో శోధించబడ్డాడు. 40 దినములు ఉపవాసముండగా, ఆకలి ఎంతో ఉన్నప్పటికీ ప్రభువు సాతాను ఇచ్చిన సలహాను పాటించలేదు.
అవ్వకు అసలు ఆకలి బాధ తెలియదు. చుట్టూ అనేక ఫలాలు అందుబాటులో ఉన్నాయి. అయినా సాతాను పెట్టిన శోధనకు లొంగిపోయి పాపములో పడింది. 40 దినాలు ఉపవాసముండి ఆకలి గొనిన ప్రభువు మాత్రం ‘మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు’ అని వ్రాయబడి ఉన్నదనెను. ఆకలి శోధనను జయించెను. ప్రభువు యొక్క ఆహారము - తండ్రి చిత్తము నెరవేర్చుట. ఆయన పని తుద ముట్టించుట. ‘నా యిష్టం నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చితిన’ని చెప్పెను. పిల్లలకు తల్లిదండ్రులు ఇంటిలో ఎన్ని నేర్పించినా, ఎన్ని సంగతులు వివరించి పంపినా బయటకు రాగానే ఎవరి ఇష్టం వారిది. బయటి వారు ఏ సలహాలు ఇస్తే వాటిని వెంటనే పాటిస్తారు. కానీ అమ్మానాన్నలు చెప్పిన మాటలు మాత్రం పక్కన పెడ్తారు.
అసలు ఈ రోజుల్లో అనేక రకాలైన ఆకలి ఉంది. ఆర్థిక ఆకలి, ఆస్తి ఆకలి, దుస్తుల ఆకలి, నగల ఆకలి, వాహనాల ఆకలి, పరువు ఆకలి, మోహపు ఆకలి, రాజకీయ ఆకలి, ఘనత ఆకలి, సంపాదన ఆకలి, ఖర్చుల ఆకలి, తిండిలో రకరకాల ఆకలి, ఐస్‌క్రీం ఆకలి, మాంసం ఆకలి, బిర్యానీ ఆకలి.. అది కూడా వారికి నచ్చిన హోటల్ నుండి మాత్రమే తేవాలి. ఇలా రకరకాలు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్టత్వాన్ని అమ్ముకొని ఆశీర్వాదాన్ని పోగొట్టుకొనటం మనం బైబిల్‌లో చూస్తాం. ఐతే 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత కూడా ప్రభువు ఆకలిని జయించాడు. మంచి మంచి కూరలతో మనుషులను లోబరచుకున్న వారిని అనేకులను చూశాం. ఎంత ఆకలి ఉన్నా ఎటువంటి అవసరమున్నప్పటికి దేవునికి మాత్రమే లోబడాలి. ఇతరులు ఇచ్చే సలహాలు చాలా బాగున్నట్టుగా అనిపిస్తాయి. చివరకు మోసపోతాం. అవసరంలోనూ బాధల్లోనూ ఉన్నప్పుడు ఎవరు చెప్పినా మంచి సలహాగానే తోస్తుంది. కాని దేవుని మాట మాత్రమే వినాలని ఇక్కడ మనకు తెలుస్తుంది
రెండవ శోధన - నీవు దేవుని కుమారుడవైతే దేవాలయ శిఖరం నుండి క్రిందకు దూకుమని. అందుకు యేసు ‘ప్రభువైన నీ దేవుని నీవు శోధించవలద’ని వ్రాయబడి ఉన్నదని అపవాదితో చెప్పెను. ప్రతిరోజూ సాతాను మనలను కూడా ఇలాంటి శోధనలతో శోధిస్తూనే ఉంటాడు. చేతిలోఉన్న టీ కప్‌నో, టీవీ రిమోట్‌నో, సెల్‌ఫోన్‌నో లేక పెన్, నీళ్ల గ్లాస్‌నో విసిరి వేయమంటాడు. అలా చేస్తే అపవాది మాట విన్నట్టే. ఒక్కొక్కసారి ఇల్లంతా గందరగోళం చేస్తారు. కిచెన్‌లో ఉన్నప్పుడు సాతాను మరీ ఎక్కువగా శోధిస్తాడు. బుద్ధిని సక్రమంగా ఉండనివ్వడు. మతిమరపును కలుగజేస్తాడు. దీనివల్ల ఆలోచనలు ఎక్కడో ఉండిపోతాయి. దాంతో వంట పాడవుతుంది. ఒక్కోసారి ప్రమాదభరితమైన విపత్తులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఒక్కొక్కసారి ఎతె్తైన భవనాల్లో ఉన్నప్పుడు, కొండల మీద ఉన్నప్పుడు అక్కడ నుండి దూకితే ఎలా ఉంటుంది? అనిపిస్తుంది. అనిపించడం కాదది. సాతాను వినిపిస్తాడు. ప్రోత్సహిస్తాడు. దీన్నిబట్టి ఒక్క విషయం అర్థమై ఉండాలి. ఎల్లప్పుడూ సాతాను మనతోనే ప్రయాణం చేస్తూ.. మనల్ని అనుక్షణం శోధిస్తూనే ఉంటాడు. కనుక మనం దేవునికి ఎంత దగ్గరగా ఉండాలో ఆలోచించుకోవాలి. దేవుని వాక్యంచే నింపబడి అపవాదికి చోటియ్యకుండా ఉండాలి. అసలు అపవాదికి చోటు లేకుండా చేయాలి.
మూడవ శోధన - ఈ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను చూపి - సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటిని నీకిచ్చెదనని చెప్పగా, యేసు వానితో - సాతానా! పొమ్ము. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను’ అని వ్రాయబడి యున్నదనెను.
ఈ రోజుల్లో అపవాది అరచేతిలో చూపే మహిమలు చూస్తూ జన్మ తరించినట్లు భావిస్తున్నారంతా. లోకమంతా సాతాను చుట్టూ తిరుగుతోంది. ఆతడి ప్రలోభాలకూ.. శోధనకూ.. మోసానికి ఇట్టే పడిపోతున్నారు. తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆదిలో జరిగిన సంగతే మరలా పునరావృతం అవుతోంది.
ఆది 3:6 - స్ర్తి ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నుల కింపైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు యుండుట చూసినపుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతోపాటు తన భర్తకు ఇచ్చింది.
సాతానుడు కల్పించిన అనేకమైన చిత్ర దృశ్యములు చూస్తూనే జీవితాన్నీ కాలాన్నీ వెళ్లబుచ్చుతున్నారు. ఇంకొంతమంది అపవాది ఇస్తానంటున్న వాటి వెనుక పడి ఏదైనా చేయటానికి సిద్ధపడుతున్నాడురు. ఈ లోక రాజ్యాలన్నీ కూడా అవసరం లేదు. చిన్న ఉద్యోగం ఇచ్చినా చిన్న రాయితీలు ఇచ్చినా ఏదైనా చేయటానికి సిద్ధవౌతున్నారు. గమనించండి. ప్రభువుకు ఈ లోకమంతా ఇస్తానన్నా తృణీకరించాడు. అయితే మనుష్యులు చిన్న వస్తువుల కోసం, చిన్న ఉద్యోగాల కోసం, చిన్న అవసరాల కోసం పడిపోతున్నారు.
1 యోహాను 2:15-17 - ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు; అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును.
మన కొరకు ప్రాణము పెట్టిన ప్రభువును ప్రేమించి ఆయన చిత్తాన్ని జరిగించి నిరంతరము నిలిచె కృప ప్రభువు మన కందరికీ కలుగజేయును గాక.

-మద్దు పీటర్ 9490651256