ప్రార్థన

ద్వేషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయన మన సమాధానమై యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్తమ్రును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. -ఎఫె. 2:14
క్రీస్తు యేసు ద్వేషమును సిలువకు కొట్టివేసి మనలను ఏకము చేసెను. తన సిలువ ద్వారా ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకము చేసి, దేవునిలో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. గనుక ఆయనే మనకు సమాధానకారకుడై యున్నాడు. -ఎఫె.2:16.
క్రీస్తు ద్వేషమును సిలువకు కొట్టి సంహరించాడు. రెండు వేల సంవత్సరాల క్రితం ఈ మహత్తర కార్యం జరిగింది. అయినా లోకంలో ద్వేషం ఉంది, కారణం క్రీస్తు యేసు ప్రేమను ఎరుగకపోవటమే. క్రీస్తును ఎరిగిన వారైతే క్రీస్తు - ద్వేషాన్ని సంహరించినట్లు ద్వేషాన్ని సిలువకు కొట్టివేయాలి. ఇది కేవలము నాలుగు గోడల మధ్య మాత్రమే ఉన్నట్టుగా ఉంది. ఈ మధ్యకాలంలో నాలుగు గోడల మధ్య కూడా ద్వేషం విహారం చేస్తున్నట్టుగా ఉంది. క్రీస్తును నమ్మి ఆయనను వెంబడించే వారిలో ద్వేషం సంహరించబడి ప్రేమ చిగురించాలి. ఈ చిగురును గోటితోనే తీసివేయటానికి, అసలు మొలక కూడా రాకుండా చేయటానికి సాతాను సవాలక్ష మార్గాలు వెతుకుతున్నాడు. వాడి మాయలో పడి దేవుని ప్రేమను పోగొట్టుకొని ద్వేషాన్ని పెంచి దేవుడిచ్చిన సమాధానము పోగొట్టుకొని, లోకమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాటలు, కక్షలు, విభేదాలు, అల్లర్లు, యుద్ధాలు, యుద్ధాలకు సిద్ధపాట్లు. మంచి చెప్పేవాళ్లు నచ్చటంలేదు. వారి మీద కోపం. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకపోవటం వల్ల ద్వేషం దినదినాభివృద్ధి చెందుతోంది. అసలు క్రీస్తు నేర్పించింది ఒకరినొకరు ప్రేమించమని. అది కూడా తాను ఎలా ప్రేమించాడో అలా ప్రాణమిచ్చే అంతగా ప్రేమించమని. ఈ విషయంలో కూడా సాతాను మానవ జాతిని మోసం చేస్తున్నాడు. వాడి మోసములో ఉన్నామన్న సంగతి తెలియాలంటే ముందు దేవుని మాటలు ఏమి చెప్పుచున్నవో చూడాలి. ఆ మాటలు అర్థము చేసుకోవాలి. పాటించాలి.
ఆదికాండము 3వ అధ్యాయములో ఆదాము హవ్వ చేయకూడదని చెప్పినది చేసి సిగ్గుతో వారికి వారే దూరమై భయముతో చెట్ల వెనుక దాగుకొన్నారు. దిగంబరులని తెలిసింది, భయము పుట్టింది. దానితోపాటు నిందలు వేయటం మొదలైంది. ఇక్కడ చూస్తే దేవుడు అడిగిన ప్రశ్న చిన్నదే. తిన్నావా? తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? అన్నప్పుడు తిన్నాను అని చెప్పాలి. కానీ సాకుతో కూడిన నిందను దేవునిపైన (నీవు నాకిచ్చిన ఈ స్ర్తి) సాటియైన సహాయముగా దేవుడిచ్చిన స్ర్తిపైన చెప్పాడు. తప్పు అయింది అని తెలుస్తుంది గానీ ఒప్పుకోకుండా సాకు, నింద మొదలుపెట్టాడు. దేవుని మేలును చాలా భద్రంగా ఉపయోగించాలి. దేవుడు మనకు మేలు చేసేది ఆయనను నిందించటానికి కాదు, మన ఉపయోగము కొరకు, అసలు ఆయననుగానీ ఆయన చేసిన కార్యములను గానీ నిరోధించటానికి నీకేమి అర్హత ఉంది. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుని ముందు నీవెంత? ప్రేమించినందుకు లోకువయ్యాడా. ప్రతి చల్లపూట సృష్టికర్తయైన దేవుడు నీతో మాట్లాడటానికి వస్తూ ఉంటే, చులకన అయ్యిందా, నెపం వేసే అంత స్థితికి ఎప్పుడొచ్చావు. అంత అహం ఎందుకు? చెప్పిన ఆ ఒక్క ఆజ్ఞను పాటిస్తూ సహాయముగా దేవుడు ఇచ్చిన హవ్వతో సంతోషంగా తోటలో ఉంటూ సేద్యం చేసుకుంటూ, కాపాడుకుంటూ ఉంటే ఎంత హాయిగా ఉండేది. మనకు అప్పగించిన పని శ్రద్ధగా చేయాలి. మాట కూడా శ్రద్ధగా వినాలి. తోటను కాయాలి అంటే, ధ్యాస దాని మీదనే ఉండాలి. అంతేకానీ ముచ్చట్లలో పడి బాధ్యత మరువకూడదు. మనకు అప్పగించిన పనులు చేసేటప్పుడు వేరే ధ్యాస, ఆలోచనలు, ముచ్చట్లు ఉండకూడదు కదా! డ్రైవింగ్ చేస్తూ ముచ్చట్లు ఎంత ప్రమాదమో ఎన్ని అనర్థాలు జరిగాయో, వంట సమయాల్లో నిప్పు దగ్గర ముచ్చట్ల వల్ల ఎన్ని ప్రమాదాలు అయ్యాయో? జాగ్రత్త ఏ పని చేసేటప్పుడు ఆ పని మీదనే ధ్యాస ఉండాలి.
నీవు చేసినదేమిటని స్ర్తిని అడుగగా - సర్పము నన్ను మోసపుచ్చిందని చెప్పింది. మోసపడకుండా మెలకువగా ఉండాలి. మోసపోకుండా ఉండాలంటే ముందు తెలివి ఉండాలి. దేవుని యందలి భయభక్తులే తెలివికి మూలము. దేవుని భయం ఉంటే, ఆయన మాట వినాలి. అప్పుడే మోసాన్ని గ్రహించగలము. నేత్రాశ శరీరాశ జీవపు డంబములో పడకుండా తప్పించుకోగలము.
తరువాత మోసపోయిన హవ్వ ఆదామును ప్రేమించిన దేవుడు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగెను. అయితే మోసము చేసిన సర్పమును శపించాడు. మరియు స్ర్తికిని సర్పమునకును, నీ సంతానమునకు స్ర్తి సంతానమునకును వైరము కలుగజేసెదను అని దేవుడు చెప్పాడు. అప్పటివరకు వైరము లేదు. దేవుడు ప్రేమా స్వరూపి. ప్రేమనే హవ్వ ఆదాములో ఉంది. పాపము చేసిన తర్వాత వైరము కలుగజేశాడు. అయితే అది మనిషికి మనిషికి మధ్య కాదు. మనిషికి శపించబడిన సాతానుకు. వైరము మనుషుల ద్వారా కాదు. అయితే సాతాను వాడి కుయుక్తులతో, వైరము మనుషుల మధ్య పుట్టించాడు. సహోదరుల మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, పట్టణాల మధ్య పల్లెల మధ్య వైరము కలుగజేసి మనకు మనకు వైరము పెట్టి, వాడేమో హాయిగా ఉన్నాడు. అంతేకాదు దేవునికి మనిషికి మధ్య వైరము కలుగజేశాడు. ఇక మనిషి దేవునినే ద్వేషించడం మొదలుపెట్టాడు. ప్రేమను ద్వేషించే స్థితికి, ప్రేమా స్వరూపియైన దేవుని ద్వేషించే స్థితికి, ఎదురుతిరిగే స్థితికి తెచ్చి అవిధేయులుగా మార్చేశాడు.
అయినా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపితే, తన సొంత వారే ప్రభువును ద్వేషించారు. ద్వేషము యొక్క ఫలం చంపటం, ఒక మనిషిని ద్వేషిస్తే ఆ ద్వేషం పెరిగి పెరిగి చివరకు చంపుకునే వరకు వస్తుంది. ఆ తరువాత గానీ అర్థం కావటంలేదు. ఎంత పనికిమాలిన పని చేశారో, చాలామంది తరువాత అర్థము చేసుకున్నా ఏమి లాభం? పోయిన ప్రాణాలైతే తిరిగి రావు కదా! అయితే ద్వేషముతో - మనలను రక్షించటానికి వచ్చిన ప్రభువునే సిలువ వేయటం జరిగింది. మన మింకను బలహీనులమై యుండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. భక్తిహీనులు బలహీనులు వారిలో బలముండదు. బలమంటే చంపేది కాదు. చెరిచేది కాదు. దోచుకునేది కాదు. పడగొట్టేది కాదు. లోకము పడగొట్టని బలము అనుకుంటున్నది. కాదు. అదే నిజమైన బలమని సాతాను మనుషులను మోసపరుస్తున్నాడు. బాగుచేసేది బలం, సిలువ చెప్పేది ప్రాణం పోసేది బలము. ఇది మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ద్వారానే వస్తుంది. ఎందుకంటే సాతానుడు బలవంతుడు, యుక్తి గలవాడు, వాడిని ఎదిరించుట మానవునికి కష్టం. చాలామంది అనుకొంటారు సొంత బలముతో సాతానును బెదిరించి నిలువగలమని. అది కూడా మోసములో భాగమే. కొన్నికొన్ని అబద్ధాలు నమ్మించటములో సాతానుడు వాడికి వాడే సాటి. ఇంత ఎందుకు ఆ దేవుడినే దేవుడు కాదు అని నమ్మించాడు. సిలువ వేయించాడు. యేసు క్రీస్తునే పడగొట్టడానికి ప్రయత్నించాడు. అయితే అది అసాధ్యము అయింది. కనుక క్రీస్తును కలుపుకుంటేనే సాతానును ఎదిరించగలము. క్రీస్తు యొక్క మారని ప్రేమతో నింపబడితేనే గానీ ద్వేషం మనలో నుండి వెళ్లిపోదు. క్రీస్తు - ద్వేషాన్ని సిలువకు కొట్టివేశాడు. కాబట్టి మనము కూడా ద్వేషాన్ని సిలువకు కొట్టిన యేసయ్యను వెంబడించి ప్రేమతో నింపబడాలి. అంతేకానీ లోకాన్ని కానీ లోక ఆశలను వెంబడిస్తే ద్వేషాన్ని మనకు కొడుతుంది. క్రీస్తు ద్వేషాన్ని సంహరించి మన మధ్య సమాధానాన్ని కలుగజేసి మనలను ఏకము చేశాడు. మనము సమాధానము కలిగి ఒకరినొకరు ప్రేమించడం ద్వారా దేవునితో కూడా సమాధానము కలిగి యున్నాము. మనము ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటే దేవునితో సమాధానము ఉండదు అనే సంగతి గుర్తుంచుకోవాలి. దేవునితో సమాధానము లేకపోతే వైరమేగా. జాగ్రత్త! తోటివారితో వైరానికి కాలుదువ్వుతున్నావంటే దేవునితో వైరము పెట్టుకున్నట్లే.
Hate, It has caused a lot of problems in the world. But has not solved one yet. -Maya Angelou
తన సహోధరుని ద్వేషించువాడు నరహంతకుడు - 1 యోహాను 3:15.
ఈ లెక్కలో మన మీద ఎన్ని మర్డర్ కేసులు ఉన్నవో? పూర్వం యిర్మియా ప్రవక్త - ధర్మశాస్తమ్రు వినిపించక మానడు, యోచన లేకుండా ఉండడు. మంచి మాటలు చెప్పక మానడు గనుక మాటలతో వానిని కొట్టుదము రండని జనులు చెప్పుకున్నారట. -యిర్మియా 18:18. ద్వేషముతో మాట్లాడే మాటలు కత్తిపోట్ల వంటివే.
అయితే దేవుడు పాపాన్ని ద్వేషించి, మానవుని ప్రేమిస్తున్నాడు. దీనిని తికమకచేసి దేవుడు మానవుని ద్వేషిస్తున్నాడని నమ్మించి, దేవునినే ద్వేషించే అంతగా సాతానుడు మానవుని మార్చాడు.
అయితే దేవుడు అసహ్యించుకొనేది, ద్వేషించేది -1.అహంకార దృష్టి, 2.కల్లలాడు నాలుకను 3.నిరపరాధులను చంపు చేతులును 4.దుర్యోచనలు యోచించు హృదయమును 5.కీడు చేయుటకు పరుగెత్తు పాదములు 6.లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు 7.అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువాడు.
దుష్టులును బలాత్కారాసక్తులును ఆయనకు అసహ్యులు -కీర్తనలు 11:5.
భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము. నీతి ననుసరించు వానిని ఆయన ప్రేమించును. దురాలోచనలు యెహోవాకు హేయములు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.
పగ కలహమును రేపును ప్రేమ దోషములను కప్పును.
పగ ద్వేషము ఉంటే అది లేనిపోని కారణాలను వెదకి కలహాల్ని రేపి గందరగోళం సృష్టించి మనుషుల మధ్య ఉన్న ప్రేమ సమాధానమంతటిని పోగొడుతుంది. ఆ గందరగోళములో క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే - దోషాలన్నీ కప్పి నెమ్మది సమాధానములు కలుగజేస్తుంది.
Hatred is a poision that destroys us from with in, producing bitterness that eats away our hearts and minds. Hatred also destroys the personal witness of a Christian because it removed him from fellowship with the Lord and other believers..
సాతాను యొక్క మాయ మాటలలో పడి వాడినే వెంబడిస్తూ, అనుసరిస్తూ, మానవుడు పాపములో కూరుకొని పోయి, శత్రువుతో చేయి కలిపిన మనలను ఇంకా ప్రేమిస్తున్నాడు ప్రభువు. తెలియక చేస్తున్నారు అన్నట్టు. సాతాను ఉచ్చుల నుండి బయటపడలేని బలహీనులను, అంటే కొన్ని తప్పు అని తెలిసి బయటపడాలని కోరిక ఉన్నా సాతానును ఎదిరించి బయటకు రాలేని బలహీనతలో ఉన్నా ఇంకను పాపములోనే ఉన్నా, శత్రువులమై ఉన్నా దేవుడు మనలను ప్రేమించి ఆయన కుమారుని మరణము ద్వారా సమాధానపరచెను.
యేసు క్రీస్తు సిలువలో శత్రుత్వాన్ని, దానివల్ల వచ్చే ద్వేషాన్ని సిలువలో కొట్టివేశాడు. అందుకే సిలువ వార్త మనకు శక్తి. మన సొంత శక్తి చేత బాగుచేయలేని ద్వేషాన్ని క్రీస్తు సిలువకు కొట్టి సంహరించాడు. ఇప్పుడు మనము చేయాల్సిందంతా ఒక్కటే. మనకు మనకు భేదాలు పెట్టి, శత్రుత్వాన్ని పెంచి పగ రగలజేసి ద్వేషంతో ఒకరితో ఒకరు సొంత అన్నతమ్ములే అక్కాచెల్లెళ్లలే, కుటుంబాలే చంపుకొని ప్రాణాలు పోగొట్టుకొని జైళ్లపాలై ఆస్తిపాస్తులు పోగొట్టుకొని మనశ్శాంతి లేక దేశాల పాలుచేసిన సాతాను పెట్టిన ద్వేషాన్ని విడిచి, ద్వేషాన్ని సంహరించిన యేసు మార్గములో ప్రేమ మార్గంలో నడవడమే. ఇదే సువార్త. లోకానికంతటికీ సువార్త.
ఒక్కసారి ద్వేషాన్ని ప్రక్కనబెట్టి ప్రేమతో మనుషులను చూడండి. ఎంత నెమ్మది, ప్రశాంతత సమాధానముంటుందో?!
విషమే కాదు మనలో ఉన్న ద్వేషము కూడా మనలను చంపగలదు. ద్వేషము చాలా బలమైంది. ఇది మన మనసును పాడుచేస్తుంది. మనస్సునే కాదు జీవితానే్న పాడుచేస్తుంది. ఒక్కసారి ఆలోచిద్దాం. మనము తోటివారిని ద్వేషించినప్పుడు మన మనస్సు ఆలోచనలు ఎలా ఉంటాయో మన గుండె ఎలా వేగంగా కొట్టుకుంటుందో, ఎంత రెస్ట్‌లెస్ అవుతామో. ఉన్నట్టుండి ప్రశాంతంగా ఉన్న సముద్రంలో పెద్దపెద్ద అలలు వచ్చినట్లు ఉంటుంది కదా. అంతేకాదు వారికేదైనా మేలు జరిగినా మంచి జరిగినా వారి పిల్లలకు మేలు జరిగినా మన మనస్సనే సముద్రములో ద్వేషము పెద్ద తుఫానుగా మారిపోతుంది. ఆలోచిస్తే వారి వల్ల మనకు నష్టం లేదు. వారికి జరిగిన మంచి వల్ల మనకు ఏ నష్టమూ లేదు. ఇప్పటికే ఎన్నో మేలులు వారికన్నా ఎక్కువే దేవుడిచ్చి ఉండవచ్చు. అయినా మనలో ఉన్న ద్వేషము మనలను తికమక చేస్తుంది. మామూలుగా ఉండలేము. మాటలు మారిపోతాయి. ఏమేమో మాట్లాడతాము. కోపం పెరిగిపోతుంది. కట్లు తెగిపోయి మనుషుల మీద పడిపోయి కొట్లాటలు, ఘర్షణ. ఇంకేముంది? ఈ పరిస్థితి చక్కబడాలంటే రోజులు నెలలు సంవత్సరాలే కాదు, జీవితాలు పట్టవచ్చు.
ద్వేషం - మనుషులను చంపుతుంది. అయినా మనం చచ్చే వరకు మనలోనే ఉంటుంది. మన అంతం చూస్తుంది. మనలను కూడా చంపుతుంది.
ప్రేమ - మరణములో కూడా ఇతరులను సంతోషంగా ప్రేమిస్తుంది. నిత్య జీవానికి నడిపిస్తుంది.
అయినా ద్వేషాన్ని వదలటంలేదు. వదలలేవు. మన వల్ల కాదు. అది గడ్డి మొలిచినట్టు మొలుస్తూనే ఉంటుంది. అయితే దాన్ని పెంచి పెద్దదిగా చేయవద్దు.
Anger and hatred are toxic emotions, which effects the body, mostly Heart.
Heart disturb అయితే దాని పరిణామము శరీరమంతా ఉంటుంది. ఊగిపోతుంది. కంట్రోల్ ఉండదు. మాటలు చేష్టలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో సాతాను మనలోనికి ప్రవేశించి చేయవలసిన నష్టం, నాశనం చేయించి, చివరకు మనల్ని కూడా వదలకుండా పాడు చేస్తాడు.
అసలు బాధాకరమైన విషయమేమంటే మనల్ని నాశనం చేయటానికి, మన వారిని మనతోటే నాశనం చేయించటానికి మనల్ని వాడుకునే సాతానును వెంబడించి వాడిచ్చే ద్వేషాన్ని నింపుకొని వాడి మార్గంలో తిరగటానికి లోకం పరుగెత్తుతుంది.
ప్రేమ మార్గము స్నేహ మార్గము జీవ మార్గాన్ని ద్వేషిస్తున్నారు. ఛాయిస్ మనదే. మన జీవితం మన ఇష్టం. ఇష్టంగా స్నేహ మార్గాన్ని ఎన్నుకుంటే జీవితం సంతోషంగా సమాధానంగా ఉంటుంది. ఈ మార్గానికి రానివ్వకుండా సర్వలోకాన్ని సాతానుడు మోసముతో మళ్లిస్తున్నాడు. ప్రేమ నుండి ద్వేషానికి నడిపించి సృష్టికర్త మీదనే ద్వేషము పెంచుతున్నాడు. జాగ్రత్త! ద్వేషం ప్రేమ మన ముందుంచాడు ప్రభువు. మరణమా? జీవమా? ఏదన్నది మన ఇష్టం. అయితే మనకు మనం వెళ్లే మార్గము చాలా మంచిదిగా కనపడుతుంది. ద్వేషించటం బాగానే ఉంటుంది. కోపం చల్లారుతుంది కానీ నష్టమే మిగులుతుంది. మరణానికి దారితీస్తుంది.
వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకు చీకటిలోనే ఉన్నాడు. చీకటి గ్రుడ్డితనము కలుగజేయును. గనుక తానెక్కడకు వెళ్లునో అతనికి తెలియదు.
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవముండదు.
అయితే తన సహోదరుని ప్రేమించువాడు మరణము నుండి జీవమునకు దాటినట్లే అని పరిశుద్ధ బైబిల్
గ్రంథం స్పష్టపరచుచున్నది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమగల జీవితం జీవించుటకు మనకు సహాయము చేయునుగాక.

- మద్దు పీటర్ 9490651256