ప్రార్థన

స్వార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహం కారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు! అనురాగ రహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు. పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుమ’ని బైబిల్ సెలవిస్తుంది. - 2 తిమోతి 3:1-5.
అపాయకరములైన దినములకు ముఖ్య కారణము స్వార్థము. (జ్య్పళూఒ యచి ఆ్దళౄఒళ్పళఒ, జ్య్పళూఒ యచి యశళక, జ్య్పళూఒ యచి -ళ్ఘఒఖూళఒ.) ఈ స్వార్థమైన మనస్సు నుండి పైన వివరింపబడిన లక్షణాలన్నీ హృదయములో చోటు చేసుకొని మనిషిని భ్రష్టుడిగా చేస్తుంది. దీని నుండి మనుషులకు ఎన్నో విధములైన అపాయాలు జరుగుచున్నవి. తనను తాను ప్రేమించుకొని ఏవేవో కోరుకొని, ఆ కోరికలు తీరటానికి ఎంతటి హీన స్థితికైనా దిగజారి తన కోరికను తీర్చుకుంటాడు. ఈ క్రమములో ఎదుటి వారు ఏమైనా పర్వాలేదు. స్వలాభ స్వార్థంలో ఉన్నవారి కన్నులు మూసికొని ఉంటాయి. ప్రాణాలు తీసైనా వారి కోరిక నెరవేర్చుకుంటారు. అది తమ్ముడు, చెల్లెలు, తల్లిదండ్రులు, బిడ్డలు అన్న విచక్షణ కూడా ఉండదు. తనకు కావలసిన చిన్న విషయాల కోసం విలువైన ప్రాణాలు తీసివేస్తుంటారు. ఒక్కోసారి ఒక్కరి స్వార్థం కోసం కొన్ని వందల మంది బలి అవ్వవలసి ఉంటుంది. కొన్ని కుటుంబాలు బలియైనవి. కొందరి స్వార్థముతో దేశాలు కూడా బానిసత్వములోనికి వెళ్లిన చరిత్ర గల దేశాలు ఎన్నో. ఒకరినొకరు స్వార్థము కోసం వారి సంతోషం కోసం వారి ఆనందం వినోదం కోసం ఇతరులను బలి చేసారు. చేస్తూనే ఉన్నారు. చాలా అపాయకరమైన దినాలలో ఉన్నాము. అయితే ముందు మనము చేయవలసినది వారికి అంటే స్వార్థపరులని తెలిసిన వారికి విముఖుడవై యుండమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాటను పాటించాలి. వారితో స్నేహము ఎప్పటికైనా మోసమే. వారి స్వార్థము మనలో కూడా పని చేయవచ్చు. జాగ్రత్త.
ఇలా జరుగుతుందని రెండు వేల సంవత్సరాల క్రితమే పౌలు భక్తుడు తిమోతికి వ్రాసిన రెండవ ఉత్తరములో వ్రాసి ఉంచాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చునని, రానే వచ్చింది అటువంటి అపాయకరమైన దినాలలో ఇప్పుడు జీవిస్తూ ఉన్నాము. కనుక ఇంకా జాగ్రత్తగా ఉండవలసి యున్నది. వారు తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుచు దేవుని బిడ్డలను దేవుని సంఘాన్ని అపహాస్యం కూడా చేస్తారని పేతురు భక్తుడు కూడా తెలియజేశాడు.
స్వార్థం పెరిగే కొద్దీ ప్రేమ తగ్గుతూ ఉంటుంది. చివరకు మరుగై పోతుంది. అయితే దేవుని ఆశ, ఆజ్ఞ మాత్రం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, దీనికి ముందు ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ హృదయముతో ప్రేమించమని. దేవుడు మనలను ప్రేమించి తన రూపులో మనలను చేసి మనము కూడా ఆయనను ప్రేమించాలని ఆశపడి ఆజ్ఞ ఇచ్చాడు. స్వార్థం వల్ల ప్రేమ తరుగుతూ తరుగుతూ వచ్చి చివరకు సృష్టికర్తనే మరచిపోయారు. ప్రేమా స్వరూపియైన దేవుని లక్షణాలన్నీ మనలో నుండి వెళ్లిపోయి, ఇక నేను నా లోకం అన్నట్టు ఉంటారు. కని పెంచిన తల్లిదండ్రులు గుర్తుకు రారు. నా ఇల్లు నా కారు నా హోదా నా పదవి నా పొలం నా సొమ్ము నా ధాన్యం నా బంగారము ఇక అంతా నా అనే లోకమును సృష్టించుకొని దానిలోనే జీవిస్తుంటారు. నా నొప్పి, నా బాధన నా వేదన నా శోధన నా ఇబ్బందులు అన్న ఒళచి ఔజఆక లో ఉంటారు. డళచి ఔజఆక జఒ ఘఒ్య ఘ ఒజశ. డళచిజఒ్దశళఒఒ జఒ య్యూఆ యచి ఆ్దళ ఒజశ.
అలా స్వార్థ లోకంలో జీవిస్తూ లోకాన్నంతటిని సంపాదించుకోవాలని అనేక మంది ప్రయత్నం చేశారు. ఎన్నో యుద్ధాలు జరిగాయి. రక్తం ఏరులై పారింది. ఎన్నో ప్రాణాలు స్వార్థానికి బలి అయ్యాయి. అయినా తృప్తి లేదు. ఇంకా ఏదో చేయాలి ఏదో సంపాదించాలి సమకూర్చుకోవాలని తపనతోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్ లోకమంతటిని జయించినా తన ప్రాణాన్ని నిలుపుకోలేక మరణ సమయములో తెలుసుకున్నాడు సత్యమేంటో. లోకమంత సంపాదించుకున్నా, ప్రాణం పోతే ఉపయోగము లేదని. స్వార్థంతో జీవితమంతా ఖర్చు చేసి ఏవేవో సంపాదించుకుంటారు. కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటారు. మిగిలిన జీవితంలో సంపాదించినదంతా ఖర్చు పెట్టి పోయిన ఆరోగ్యాన్ని సంపాదించుకోటానికి ప్రయత్నిస్తారు. ఫలితం జీవితమంతా ఆయాసమే. సంతోష సమాధానాలు ఉండవు.
యేసు చెప్పిన మాట- ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము. ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమివ్వగలడు? - మత్తయి 16:26.
జీవాధిపతియైన యేసు - నిత్య జీవమివ్వగల యేసు. తన శిష్యులకు చెప్పిన మాట - స్వార్థం ఉండకూడదని. నిస్వార్థంగా ఉండమని. స్వార్థం 0%కు దిగిపోవాలి. ప్రేమ నిండుగా నూటికి నూరుపాళ్లు ఉండాలని. ఎందుకంటే స్వార్థం పెరిగే కొద్దీ ప్రేమ తగ్గుతూ ఉంటుంది.
స్వార్థం ప్రేమ
0% 100%
90% 10%
100% 0%
మా ఇంటికి వస్తే ఏం తెస్తావ్? మీ ఇంటికి వస్తే ఏం పెడతావ్? అనేది స్వార్థం.
దేవుడు ప్రేమా స్వరూపి. నూటికి నూరు శాతం ప్రేమ గల దేవుడు. అదే ప్రేమతో లోకాన్ని ప్రేమించి ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు. పూర్తిగా మనకు ఇచ్చి వేశాడు. తన సొంత కుమారుని, ఏకైక కుమారుని మనకు అనుగ్రహించిన నిస్వార్థ ప్రేమను చూడండి. మనం ఎంత మంచివారమైనా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. ప్రభువుకు స్వార్థం లేదు. ప్రేమ ప్రేమ. అంతే. మనము కూడా ఆయన రూపులోనికి మార్చబడి ఆయన ప్రేమను కలిగి యుండి ఆయన కుమారులముగా కుమార్తెలముగా జీవించాలని, నిత్య రాజ్యానికి వారసులమవ్వాలని, క్రీస్తుతో కూడా సింహాసనము మీద కూర్చోవాలని దేవుని ప్రేమ. అందుకే ఇవన్నీ పొందుకోవాలని మనకు ఒక సూత్రాన్ని ఇచ్చాడు. ముందుగా స్వార్థాన్నంతటిని తీసివేయమంటున్నాడు. మనల్ని మనం 0%కు తగ్గించుకోమంటున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలమయ్యే ఆధిక్యత వస్తుంది. ఇది కేవలం పేరు మాత్రమే కాదు నిజముగా ఆయన రాజ్యములో మనకు వారసత్వముంటుంది. చాలామంది స్వార్థానికి మనలను వాడుకోటానికి నీవు నా కొడుకువి నా వారసుడివి అని ఇంకా ఏవేవో చెబుతారు. చివరకు వారి కుమార్తెలకు కుమారులకే ఆస్తిని పంచుతారు. ఇలాంటి విషయాలు ఎన్నో మనం చూశాం. నా కొడుకు, నా పెద్ద కొడుకండీ అని పరిచయం చేస్తారు. పని చేయించుకుంటారు. చివరకు గానీ అర్థం కాదు వారు ఎంత స్వార్థపరులో.
తన ప్రాణము స్వార్థముతో కాపాడుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకోవటం ఖాయం. అయితే ఎవడైతే క్రీస్తు పిలుపు నంగీకరించి నిస్వార్థంగా క్రీస్తు కోసం జీవించి ప్రాణాలు పోగొట్టుకుంటే దానిని మరలా దక్కించుకుంటాడు. ఈ ఆహ్వానం ఇప్పటికీ లోకమంతటికీ ఉంది. నిఆ’ఒ ఘశ యఔళశ జశ్పజఆ్ఘఆజ్యశ ఆ్య ఆ్దళ జ్యీజూ. దీనిలో క్రైస్తవులని హిందువులని ముస్లింలని, ఆడ మగని, వేరే దేశమని తేడా ఏమీ లేదు. అందరూ ఆహ్వానితులే. ఎటువంటి వత్తిడి లేదు. నీ జీవితం నీ ఇష్టం.
‘ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును’ - మత్తయి 11:28.
క్రీస్తును గూర్చి ఆయన గొప్పతనాన్ని గూర్చి తెలుసుకున్న యెరికో పట్టణమునకు చెందిన జక్కయ్య పన్నులు వసూలు చేసే అధికారి. అధిక పన్నులు వసూలు చేసి దేశ ప్రజలను పిప్పి చేశాడు. ఈ అధికారులను ఒక విధముగా చూసెడివారు. ఇతను కూడా స్వార్థముతో ఎక్కువ పన్నులు ప్రజల దగ్గర వసూలు చేసేటివాడు. కనుక యెరికో పట్టణపు వారు ఆయనను మోసకారిలాగనే చూసేవారు. అయితే ఎప్పుడైతే ప్రభువు అంగీకరించాడో ఆయనలో ఉన్న స్వార్థము వెళ్లిపోయి ప్రేమతో నింపబడి తాను అన్యాయముగా సంపాదించినదంతయు తిరిగి నాలుగు పాళ్లు చెల్లించటానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు ఇదిగో ప్రభువా! నా ఆస్తిలో సగభాగము బీదల కిచ్చుచున్నాను (బీదల కివ్వటమంటే దేవుని కివ్వటమే) నేనెవని వద్దనైన అన్యాయంగా దేనినైన తీసికొనిన యెడల అతనికి నాలుగింతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. - లూకా 19:8
వెంటనే ప్రభువు చెప్పిన మాట. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నదని. స్వార్థంతో సంపాదించిన డబ్బులు ఎంత ఉన్నా నెమ్మది సమాధానము సంతోషముండదు. ఎవరెవరిని అన్యాయము చేశామో వారివి వారికి చెల్లిస్తే ప్రభువు ప్రేమ మనలో ఉంటుంది. డబ్బు ఇవ్వలేని సమాధానము వస్తుంది. రక్షణ లభిస్తుంది.
స్వార్థంతో అన్యాయంగా ప్రజల వద్ద డబ్బు దోచుకొని శాంతి సమాధానములు లేకుండా ఏమి చేయాలో పాలుపోక గుండె బరువెక్కి, ఆత్మహత్యలు చేసుకున్న వారెందరో. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
తప్పు తెలిసికొని, అన్యాయముగా వసూలు చేసిన వారికి తిరిగి నాలుగింతలు చెల్లించినప్పుడు ప్రభువు వారిని క్షమిస్తాడని ఈ జక్కయ్య విషయంలో తెలుస్తోంది. నాలుగింతలు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. ఎంత చెల్లించగలిగితే అంత చెల్లిస్తే చాలునని, చాలామంది అటువంటి సెటిల్‌మెంట్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని న్యాయాధిపతుల భావన. దేవుడే క్షమించాడు గనుక మనుషులు క్షమించవచ్చు, న్యాయాధికారులు కూడా క్షమించవచ్చు. కనుక అనవసరమైన ఆలోచనలు స్వార్థపూరిత ప్రయత్నాలు మానివేసి నిస్వార్థంగా చేయగలిగినది చేసినట్లయితే మనుషులు క్షమిస్తారు. దేవుడు క్షమిస్తాడు గనుక నెమ్మది దొరుకుతుంది. శేష జీవితం సుఖంగా ఉంటుంది.
చిన్నచిన్న విషయాలలో కూడా స్వార్థం ఎలా ఉంటుందో చూడండి. బస్టాండ్‌లో నించొని బస్సు ఆపకపోతే రెస్ట్‌లెస్ అయిపోయి ఇష్టమొచ్చినట్లు తిడతారు. బస్సు దొరికి ఎక్కిన తరువాత అక్కడక్కడ బస్సు ఆగి ప్రయాణీకులను ఎక్కించుకుంటుంటే కూడా డ్రైవర్‌ను తిడతారు. చూడండి ఎంత స్వార్థమో. ఆపకపోయినా, ఆపినా సమస్యే?
ఇటువంటి స్వార్థంతో ఎంత విలువైన దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటామో ప్రభువు తెలియజేశాడు. ధనవంతుడైన యవనస్థుడు ప్రభువు దగ్గరకు వచ్చి, నిత్యజీవాన్ని కోరాడు. అయితే ప్రభువు పది ఆజ్ఞలు పాటించమని చెప్పినప్పుడు, అతడు చిన్ననాటి నుండి నేను చేస్తూనే ఉన్నానని చెప్పాడు. అన్ని చేస్తున్నా తనలో తగ్గింపు లేదు. పేదవారి మీద జాలి లేదు. గనుక నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చి - వచ్చి నన్ను వెంబడించమని చెబితే అతడు మిక్కిలి ధనవంతుడు గనుక వ్యసనపడి వెళ్లిపోయాడు. ఒకవేళ అటువంటి స్థితిలో ఉన్నావేమో జాగ్రత్త. ఏది ముఖ్యము అన్నది గమనించాలి, జీవాధిపతి ముఖ్యమా? డబ్బు ముఖ్యమా? ఎవరి ఇష్టం వారిది. ప్రాణం పోయిందంటే - డబ్బు పోద్ది, ఆస్తిపాస్తులన్నీ పోతాయి. నిత్య రాజ్యం కూడా దొరకదు. జీవాధిపతి ముఖ్యమా? జీవాన్ని ఇవ్వలేని ఆస్తిపాస్తులు ముఖ్యమా?
మనము చూసిన వారిలో మదర్ థెరిసా ఒకరు. నిస్వార్థంగా జీవించి మంచి తల్లి అనే బిరుదు తెచ్చుకున్నారు. దేశం కాని దేశంలో ఉండి ఎంత నిస్వార్థమైన సేవ జరిగించిందో వింటుంటే ఒళ్లు గగుర్పాటు చెందుతుంది. కుష్టు వ్యాధిగల వారి మధ్య, క్షయ లాంటి అంటువ్యాధులున్న వారి మధ్య పరిచర్య చేసి నిస్వార్థం అంటే ఏంటో తెలియజేసింది. తన సేవను గుర్తించి నోబెల్ బహుమతి ఇస్తే దాని డబ్బుతో కూడా సేవ చేసింది. ఇదీ నిస్వార్థ సేవ అంటే. లక్షల మందికి సేవ చేసింది. కానీ తన సంపాదన వస్తువులు ఒక చిన్న బెడ్, చిన్న టేబుల్ మాత్రమే. జళఒఒ ఖఘ్ళ యూౄళ ష్యౄఛ్యిఆ అన్నట్టు, నిస్వార్థంగా ఉంటే ఎక్కువ సేవ జరుగుతోంది. ఎక్కువ మందికి ఉపయోగపడతాము. స్వార్థముంటే ఎంత ఉన్నా చాలదు. ఎంతమంది సేవ చేసినా తృప్తి ఉండదు.
కుటుంబాలలో స్వార్థముండుట వల్ల ఆ కుటుంబాలు నిలువటం లేదు. నేనే చేస్తున్నాను నేనే కష్టపడుతున్నాను నా వల్లనే అనే స్వార్థము వచ్చిందంటే - అంతే ఆ కుటుంబం నిలవటం కష్టమే. ఒక సంగతి గుర్తుంచుకోవాలి. ప్రభువు మాట ప్రకారము నిస్వార్థముగా కనపడినవి చేసుకుంటూ పోతూ ఉంటే, దేవుడు చూస్తూ ఉంటాడు గనుక ఆయన ఆశీర్వదిస్తాడు.
మోషే స్వార్థంగా ఉన్నట్లయితే ఎంతో తేలికగా ఐగుప్తు దేశానికి రాజు అయ్యేవాడే గానీ తన ప్రజలందరి కోసం, రాజరికాన్ని ధనాన్ని వదలి అనేక ఇబ్బందులు పడి, అనేక మాటలు అనిపించుకొని చివరకు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వము నుండి బయటకు తీసుకు రాగలిగాడు. ఆ ఒక్కని నిస్వార్థం వల్ల లక్షల మంది ఇశ్రాయేలీయులు విడిపించబడ్డారు.
యేసు క్రీస్తు యొక్క నిస్వార్థమైన త్యాగ జీవితము వల్ల లోకానికి రక్షణ లభించింది. ప్రాణాన్ని బలిపెట్టే అంత నిస్వార్థమైన జీవితం ఆయన జీవించాడు. ఆయన మంచి భవనాలు కట్టించుకోలేదు. బంగారం, ఆస్తిపాస్తులు ఏమీ సంపాదించుకోలేదు. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్లున్నవి గానీ మానవ రూపములో వచ్చిన ప్రభువుకు తలవాల్చుటకైనను స్థలము లేదు. ఆయన పుట్టుకకు కూడా స్థలము లేక ఒక పశువుల పాకలో జన్మించినట్టు తెలుస్తుంది. క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకొనలేదు. గనుక నీకు బలముంటే బలహీనులకు సహాయము చేయాలి. మనలను మనమే సంతోషపరచుకొనక, పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు ప్రతివాడు మేలైనది చేయుచుండవలెను.
జీవించు వారికి మీదట తమ కొరకు గాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను.
ప్రపంచములో సెకనుకు ఒకరు ఆకలితో చనిపోతున్నారంటే కారణం భూమి మీద ఆహారము లేక కాదు. భూమిమీద ఉన్న ప్రతి ఒక్కరికి సరిపడ్డ ఆహారము పండుతుంది. కానీ దానిని సరైన రీతిలో వాడకపోవటం వల్లనే. పండిన పంటలో మూడింట ఒక వంతు వృథా అయిపోతోంది. అంటే ఆహారము లేక కాదు గానీ దానిని సరైన రీతిలో పంచుకోలేక, కొంతమంది స్వార్థపరుల వల్ల అనేక మందికి ఆహారము అందటంలేదు. అదే విధంగా నీరు వృథా అయినా చేస్తారు గానీ ఇతరులతో షేర్ చేయటానికి ఇష్టపడరు. దేవుడు మనకు కావలసిన వనరులు అన్నీ సమృద్ధిగానే ఇచ్చాడు. కానీ స్వార్థం వల్ల కొంతమంది మాత్రమే వాటిని పొందుకోగలుగుతున్నారు.
కొంతమందికి నిలువ నీడ లేదు, కొంతమంది ఆకాశాన్ని అందుకుంటున్నారు గానీ నిలువ నీడ లేని వారిని పట్టించుకోవటం లేదు. ఒక మనిషిగా కూడా చూడటం లేదు. కానీ ప్రభువు చెప్పిన మాట అల్పులైన వారిలో ఒకరికి అన్నం పెట్టినా, వస్తమ్రిచ్చినా, నీళ్లిచ్చినా, అది ఆయనకు చేసినట్టేనట. స్వార్థంతో వృథా చేస్తున్నారు, మురగ పెడుతున్నారు గానీ సాటి మానవుని పట్టించుకోవటం లేదు. అందుకే దేవుడిచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, అది కూడా క్రీస్తు ప్రేమించినట్టు. క్రీస్తు ప్రేమ ఎంత నిస్వార్థమైందో మనకు తెలుసు. తన చివరి రక్తపుబొట్టు కూడా కార్చి తన ప్రాణం పెట్టి మనలను ప్రేమించాడు. మనలను కూడా అలాంటి ప్రేమతో నిస్వార్థంగా ఒకరి నొకరు ప్రేమించమని ఆజ్ఞాపించాడు. దేవుడు చెప్తే ఏమిటి? మా స్వార్థం మాదే అని ఎవరి సుఖం వారు చూసుకుంటున్నారు.
ఈ లోక జీవనోపాధి కలిగియుండి తన సహోదరునికి లేమి కలిగి యుండుట చూచియు అతని యెడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును.
ఎవడును తన కొరకే కాదు, ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. - 1 కొరింథీ 10:24. ఆలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు.
నీవు లోకమునకు వెలుగు అయితే స్వార్థంగా దాచిపెడితే నీకు కూడా ఉపయోగపడదు. నిస్వార్థంగా దీప స్తంభము మీద పెట్టితే ఇంట ఉండువారందరికీ వెలుగే. స్వార్థముతో దాచిపెట్టక వెలుగుచు అనేకులను వెలిగించటానికి, లోకము దేవుని వెలుగుతో నింపబడటానికి, సముద్రము నీళ్లతో నింపబడినట్లు లోకము దేవుని నిస్వార్థమైన ప్రేమతో నింపబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయును గాక.
స్వార్థాన్ని పారద్రోలి ప్రేమను పొందుకొని అందరం కలిసి ఒకరి కష్టాలలో ఇంకొకరు ఆదుకుంటూ నిస్వార్థ సమాజాన్ని నిర్మిద్దాం.

- మద్దు పీటర్ 9490651256