ప్రార్థన

క్రీస్తు వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవత్వం మసిబారింది. దేవుని వెలుగును గ్రహించలేనంతగా మసిబారింది. దేవుని అమూల్యమైన ప్రేమను పట్టించుకునే పరిస్థితిలో లేదు. అంధకారంలో కొట్టుకొని పోతోంది. దేవుడూ వద్దూ.. దేవుని ప్రేమా వద్దూ అంటూ చివరకు దేవుడెవరు? అనే స్థితికి మానవత్వం దిగజారింది. తల్లిదండ్రులెవరు? వారేం చేశారు? నా కష్టమే నన్నీ స్థితికి తెచ్చింది. కనుక నా ప్రాణమా! తినుము, త్రాగుము, సుఖించుము అనుకుంటూ ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా విలాసవంతంగా జీవిస్తూ వారి సుఖ సంతోషాల కోసం చేసే పనులు సృష్టికర్త చూడడా?!
ఆదికాండము 6వ అధ్యాయంలోనే ‘నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు’ యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడైన యెహోవా ఎంతో ప్రేమతో తన స్వరూపంలో నరుని సృజించి, తూర్పున ఏదేనులో ఒక తోట వేసి నరుని దానిలో ఉంచెను. చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. నరుని ఏలుబడి క్రింద సమస్తాన్ని ఉంచాడు. వారు ఫలించి అభివృద్ధి చెందినప్పుడు, దేవుడు భూలోకమును చూచినప్పుడు చెడిపోయి ఉండెను. బలాత్కారముతో నిండియుండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. అందరూ దారి తొలగి బొత్తిగా చెడి యున్నారు. మేలు చేయు వారెవరును లేరు. ఒక్కడైనను లేడు.
పిల్లలను కని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తరువాత ప్రయోజకులై తల్లిదండ్రులను సంతోషపెట్టవలసిన సమయంలో వారి ఇష్టానుసారంగా ఉంటున్నప్పుడు బాధపడి, వారి వ్యసనాలు, తాగుడు, జూదం, వ్యభిచారం, లంచగొండితనం లాంటివి చూసినప్పుడు.. అసలు వీరినెందుకు కన్నాను అనే బాధలో అనేక కుటుంబాలున్నాయి. మన తల్లిదండ్రులకు తండ్రి వారి తల్లిదండ్రులకు, మన పూర్వీకులకు తండ్రియైన దేవుడు ఆకాశం నుండి చూచి నొచ్చుకొని జలప్రళయం ద్వారా నేల మీదనున్న జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రళయమును రప్పించెను.
యెహోవా దేవునికి ‘నోవహు’ ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడు. నిందారహితుడు, దేవునితో నడిచినవాడు కనుక దేవుని దృష్టి యందు కృప పొందాడు నోవహు. ఆతడి విశ్వాసమునుబట్టి అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసికొన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట ప్రకారము చేయు వారి చుట్టూ ఆయన దూత కావలి యుండి వారిని అనుక్షణము రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయన యందు భయభక్తులు ఉంచుకొనిన వానికి ఏమియు కొదువలేదు.
జలప్రళయం ముగిసింది. నోవహు కుటుంబమును దేవుడు ఆశీర్వదించగా, వారు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపారు. మరలా మానవ పరిస్థితి నోవహు కాలములో ఉన్నట్టుగా మారిపోయింది. భక్తి తగ్గిపోయింది. దేవుని భయం లేదు. పెద్దల భయం లేదు. కట్టుబాటు లేదు. దొంగతనాలు, హత్యలు, కుట్రలు, త్రాగుడు, వ్యభిచారం. వావి వరుసలు లేవు. లంచగొండితనం పెరిగింది. ధనాపేక్ష. భేదములు, విమతములు. అల్లరితో కూడిన ఆటపాటలు తారాస్థాయికి చేరుకొని పాపాంధకారంలో కూరుకుపోయి ఎటు ఎళ్తున్నారో? ఏం చేస్తున్నారో తెలియదు. ముందు లోయలున్నా.. గాఢాంధకారం ఉన్నప్పటికీ.. దారీతెన్నూ తెలియనప్పటికీ దిక్కుతోచని రీతిలో పాపంలో పడి కొట్టుకుపోతున్నారు. అంతా చీకటిమయం.
ఇటువంటి అంధకార జీవితానికి వెలుగునివ్వటానికి, మంచి దుర్గము చూపటానికి జీవాధిపతియైన క్రీస్తు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు.
కానీ ఆయన్ని మానవుడు గుర్తించలేదు. పాపంలో కొట్టుకుపోతూ.. అంధకారంలోనే మ్రగ్గిపోతూ.. మన పాపాల నిమిత్తం బలి యాగం కానున్న యేసుని సిలువ వేశాం. మరణ వేదన కలిగించాం. ఐతే - ఆయన మహిమను తెలుసుకోలేక పోయాం. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. పునరుత్థానుడై.. మనలను దేవుని కుమారులగుటకు అధికారమిచ్చాడు. కనుక క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. దేవుని యందు విశ్వాసముంచి ఓడ లోనికి ప్రవేశించిన నోవహు వలె రక్షింపబడతారు. విశ్వసింపని వారికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడువైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.
ఒకప్పుడు చీకటిని ప్రేమించి చీకటి కార్యాలలో ఉన్నప్పుడు క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనని తాను దేవునికి సమర్పించుకొన్నాడు. మనము బలహీనులుగా ఉన్నప్పుడు, పాపులుగా, శత్రువులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనలను ఇంతగా ప్రేమించి ఇకనైనా వెలుగులోనికి రావాలనీ, చీకటి రాజ్యాన్ని విడచి జీవపు వెలుగులో నిత్య రాజ్యము చేరాలని దినమంతయు చేతులు చాచి పిలుచుచుండగా, తల్లిదండ్రుల ప్రేమ కంటె మించిన ఈ ప్రేమను ఒక్కసారి అంగీకరించి చూడు. యేసు రక్తములో మన ప్రతి పాపము కొట్టివేయబడుతుంది. చిమ్మచీకటిలోనికి వెలుగు వచ్చి చీకటిని ఎలా పారద్రోలుతుందో అలా యేసు రక్తము మనలను కడిగి హిమము కంటె తెల్లగా చేసి ఉత్సాహ సంతోషాలతో నింపుతుంది. ఈ లోకం ఇవ్వలేని సంతోషమది.
యోహాను 8:12 - యేసు -నేను లోకమునకు వెలుగును
నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండున’ని చెప్పెను.
క్రీస్తును వెంబడించి వెలుగు ఫలములు ఫలించి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకమునకు వెలుగుగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.

-మద్దు పీటర్ 9490651256