పోస్ట్ ప్రొడక్షన్‌లో ప్రేమాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వినాయక క్రియేషన్స్ పతాకంపై సుజయ్, శే్వతానీల్, వినయ్‌తేజ్ ప్రధాన తారాగణంగా ఆర్.వరుణ్‌దొర దర్శకత్వంలో ఆర్.వి.నారాయణరావు, ఆర్.బి.ఆర్య రూపొందిస్తున్న చిత్రం ‘ప్రేమాంజలి’ (ఓ ప్రేమ జంట కథ). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు దొర మాట్లాడుతూ, ప్రేమంటే ఓ బంధం కాదని, ప్రేమంటే ఓ బాధ్యత అనే అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. లవ్ అంటే ఫ్యాషన్‌గా మారిపోతున్న ఈ రోజుల్లో ప్రేమకు గౌరవం కల్పిస్తూ ఈ సినిమాను వైజాగ్, హైదరాబాద్, ఖమ్మం, కర్నాటక, గోవా వంటి పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశామని తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. భరణి శంకర్, ఆకెళ్ల గోపాలకృష్ణ, కోటేశ్వరరావు, సుజాతారెడ్డి, శిరీష, కాటంరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పి.జి.వర్ధన్, కెమెరా: భాస్కర్ దోర్నాల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.వరుణ్‌దొర.