Others

ఔను.. పెళ్లయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటినుంచో తన పెళ్లి గురించి పలు విశేషాలు చెప్పీ చెప్పక తప్పించుకు తిరుగుతున్న ప్రీతిజింతా చివరికి హాట్ న్యూస్ బయటపెట్టింది. తనకు జీన్‌గుడ్ ఇనఫ్ అనే వ్యక్తితో లాస్‌ఏంజిల్స్‌లో పెళ్లి జరిగిందని ప్రకటించింది. అయితే పెళ్లి రహస్యంగా జరిగిందన్నది ఆమె కథనం. అలా ఎందుకంటే అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. మరి రిసెప్షన్ ఎప్పుడని ఎవరైనా అడిగితే హనీమూన్ ముగిశాక అని బాంబు పేలుస్తోందట. అదేంటి పెళ్లయ్యాక హనీమూన్‌కు వెళ్లడం సహజమే. కానీ రిసెప్షన్ చేసుకొని, అందరి దీవెనలు అందుకొని కదా వెళ్లేది అని అడిగితే మాత్రం మనదంతా వెరైటీనే కదా! పెళ్లే వెరైటీ. అలాగే రిసెప్షన్ కూడా వెరైటీ అంటూ నవ్వేస్తోదంట. ఏమైనా మాటలు చెప్పడంలో ప్రీతిజింతాను మించిన వారెవరు?