రాష్ట్రీయం

ముఖ్య కార్యదర్శి నేడు హాజరు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి వ్యవసాయ శాఖకు హైకోర్టు ఆదేశం
ఆంధ్ర ప్రభుత్వ తీరుపై ధర్మాసనం అసహనం
తెలంగాణ సర్కారు చర్యలకు అభినందనలు
హైదరాబాద్, నవంబర్ 30: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో రైతుల ఆత్మహత్యలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రైతుల ఆత్మహత్యల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందన నిర్లక్ష్యంగా ఉందని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వడం సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్ కోర్టులో ఉన్నా అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఈ కేసుకు హాజరు కావడం, ఆయన కేసు గురించి సరిగ్గా వివరించ లేకపోవడంతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసేల్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ముఖ్య కార్యదర్శి విజయవాడలో జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నందున కోర్టు ముందుకు రాలేరని ప్రభుత్వం తరఫు ఎజిపి తెలియజేయడంతో మంగళవారం కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై తీసుకుంటున్న చర్యలను కోర్టు అభినందించింది.