జాతీయ వార్తలు

పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాసోర్, నవంబర్ 26: దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృధ్వీ-2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటిఆర్) నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఐటిఆర్‌లోని కాంప్లెక్స్- 3 నుంచి పరీక్షించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. క్షిపణి పరీక్షను పర్యవేక్షించిన స్ట్రేటజిక్ ఫోర్స్ కమాండ్(ఎస్‌ఎఫ్‌సి) దీనిపై ఓ ప్రకటన చేస్తూ పరీక్ష విజయవంతపైందని తెలిపింది. ట్విన్ ఇంజన్లతో పనిచేసే పృధ్వీ-2 ఉపరితలం నుంచి ఉపరితలంకు 500 కిలోల నుంచి 1000 కిలోల బరువున్న ఆయుధాలను తీసుకెళ్లగలదు. రక్షణశాఖ డిఆర్‌డిఓ శాస్తవ్రేత్తలు పర్యవేక్షణలో దీన్ని రూపొందించారు. వరుస పరీక్షల్లో భాగంగా ఇదే ఐటిఆర్ నుంచి గత ఫిబ్రవరి 19న పృధ్వీ-2ను పరీక్షించారు.