ఆంధ్రప్రదేశ్‌

రోజాకు మరో అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరై క్షమాపణలు చెప్పేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఎపి శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. అయిదుగురు వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ప్రివిలైజ్ కమిటీ (శాసనసభ హక్కుల కమిటీ) చేసిన సిఫార్సులపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైకాపా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ప్రివిలైజ్ కమిటీ ఎదుట క్షమాపణలు చెప్పడంతో వారిపై చర్యలు తీసుకోవడం లేదని మంత్రి వివరించారు. మరో వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానిపై క్షమశిక్షణ చర్యను వాయిదా వేశామన్నారు. ప్రివిలైజ్ కమిటీ ఎదుట రోజా హాజరుకాలేదని, అయినా క్షమాపణ చెప్పేందుకు ఆమెకు మరో అవకాశం ఇస్తున్నామన్నారు. ఆమె స్పందన అనంతరం కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలుంటాయన్నారు. శాసనసభ వ్యవహారాల్లో స్పీకర్‌దే తుది నిర్ణయమని, ఏ సంస్థలూ స్పీకర్‌పై ప్రభావం చూపలేవన్నారు. యనమల ప్రసంగం అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.