బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 94.65 పాయింట్లు పుంజుకుని 24,717.99 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 24.05 పాయింట్లు కోలుకుని 7,510.20 వద్ద నిలిచింది. వరుస ఆరు రోజుల లాభాలకు గురువారం నష్టాలతో సూచీలు బ్రేక్ వేసినది తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఎఫ్‌ఎమ్‌సిజి, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో మళ్లీ లాభాలు సాధ్యమయ్యాయి. ఇకపోతే ఎఫ్‌ఎమ్‌సిజి, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ రంగాల షేర్ల విలువలు 1.24 శాతం నుంచి 0.03 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.20 శాతం నుంచి 1.08 శాతం వరకు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు కూడా 1.57 శాతం నుంచి 2.29 శాతం మధ్య లాభాల్లో కదలాడాయి. కాగా, ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 71.51 పాయింట్లు, నిఫ్టీ 24.85 పాయింట్లు మేర పెరిగాయి.