తెలంగాణ

ప్రగతి కాముకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ప్రగతి కాముక బడ్జెట్. అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపులో సమతుల్యం పాటించారు. నీటిపారుదల, సంక్షేమ రంగాలకు ఎక్కువ నిధులివ్వడం సముచిత నిర్ణయం. ప్రణాళిక వ్యయానికి పెద్ద పద్దు పెట్టడం బంగరు తెలంగాణకు తొలి పొద్దు అనుకోవాలి.
- సిఎం కె చంద్రశేఖర్ రావు

ఆచరణ అసాధ్యం

బడ్జెట్ ఆచరణ అసాధ్యం. కెసిఆర్, కెటిఆర్, హరీశ్ శాఖలకు అధికంగా నిధులు కేటాయించి మిగిలిన శాఖలపై నిర్లక్ష్యం వహించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకానికి ఒక్క రూపాయి కేటాయించక పోవడం చిత్తశుద్ధి లేమికి నిదర్శనం.
- టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్

అంతా డాంబికం

ప్రభుత్వ డాంబికానికి పరాకాష్ఠ బడ్జెట్. ఇప్పటి వరకూ తెరాస మూడు బడ్జెట్లు ప్రతిపాదించినా, ఆర్థిక వ్యవస్థపై పట్టురాలేదనడానికి ఇదో నిదర్శనం. రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది కానీ, బడ్జెట్‌లో నయా పైసా కేటాయించలేదు.
- తెదేపా నేత రేవంత్ రెడ్డి