జాతీయ వార్తలు

పీఎస్వీఎల్‌వీ-సీ46 ప్రయోగం విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరికోట: పీఎస్వీఎల్‌వీ-సీ46 ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఈ రోజు 5.30 గంటలకు పీఎస్వీఎల్‌వీ-సీ46 నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఈరోజు మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. 615కిలోల బరువు గల రీశాట్ -2బీర్1 అనే ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీసీ-సీ46 వాహన నౌక 557 కి.మీ ఎత్తులో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో ఈ ప్రయోగం దిగ్విజయం అయింది. ఈ ఉపగ్రహ ప్రయోగం వల్ల రక్షణశాఖకు ఎంతో ప్రయోజనం. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను గుర్తిస్తుంది. అంతేకాక అటవీశాఖ, వ్యవసాయ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ పీఎస్‌ఎల్వీ ద్వారా ఇప్పటి వరకు 353 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టామని చెప్పారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని జూలై 9-16 తేదీల మధ్య చేపట్టనున్నామని తెలిపారు. సెప్టెంబర్‌లో చంద్రుడిపై కాలుమోపే అవకాశాలు ఉన్నాయని అన్నారు.