యువ

స్మార్ట్ ఫోనే స్టెతస్కోప్ కూడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జేబులో స్మార్ట్ఫోన్ ఉంటే, ప్రపంచం మీ వెంట ఉన్నట్టే. మీరు నడుస్తుంటే పల్స్ రేటు చెబుతుంది. పడుకుంటే అలారమ్ మోగించి నిద్ర లేపుతుంది. ఇక సమాచారం అందించడం గురించి సరేసరి. అయితే గుండె పనితీరును పసిగట్టే స్టెతస్కోప్‌కూ స్మార్ట్ ఫోనే ప్రత్యామ్నాయం కాబోతోంది. అదే విడ్డూరం. ఆర్లాండో హెల్త్ సంస్థలో కార్డియాలజీ విభాగానికి చీఫ్‌గా పనిచేస్తున్న డాక్టర్ డేవిడ్ బెల్లో కనిపెట్టిన ఈ విధానం మార్కెట్లోకి వస్తే ఇక సాంప్రదాయ స్టెతస్కోప్‌లకు కాలం చెల్లినట్టే. హార్ట్ బడ్స్ అనే ఈ సరికొత్త స్టెతస్కోప్ ఎలా పనిచేస్తుందంటే- ఎలక్ట్రానిక్ డిస్క్ వంటి పరికరాన్ని రోగి గుండె దగ్గర ఉంచుతారు. దానిని, ఐ ఫోన్ హెడ్ జాక్‌నూ అనుసంధానం చేస్తూ ఓ వైర్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిస్క్‌లాంటి పరికరం వెలువరించి హృదయ స్పందన శబ్దాలను సంబంధిత యాప్ సహాయంతో ఐ ఫోన్ హెడ్ జాక్‌లో వినవచ్చు. స్క్రీన్ మీద కనిపించే హృదయ స్పందనల రేఖా చిత్రాలను ఫోన్‌లోనే చూడవచ్చు కూడా. *