ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల్లో ప్రజలకు మెరుగైన సేవలు: డిజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విస్తృత సన్నాహాలు చేస్తున్నామని ఎపి డిజిపి నండూరి సాంబశివరావు శనివారం మీడియాకు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో వాహనాలకు పార్కింగ్ స్థలాలు కేటాయించామని, ఘాట్‌ల వద్దకు నేరుగా వాహనాలను అనుమతించేది లేదన్నారు. ఘాట్‌లకు కనీసం కిలోమీటర్ దూరంలో వాహనాలను నిలపాలన్నారు. భక్తుల అవసరాలకు తగ్గట్టు ఆర్టీసీ పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తుందన్నారు. పిల్లలతో వచ్చే తల్లులకు, వృద్ధులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్టీసీ, పోలీసు శాఖ అందించే సేవల గురించి భక్తులకు తగిన సమాచారం అందిస్తామన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహన చోదకులు పోలీసు శాఖకు సహకరించాలని డిజిపి కోరారు. వాహనాలను ఎక్కడ పడితే అక్కడ ఆపితే జరిమానాలు విధిస్తామన్నారు. పుష్కరాల్లో సుమారు 24వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వివరించారు.