అంతర్జాతీయం

మోదీకి బహుమతిగా గాంధీ డైరీలో పేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుదైన కానుకలు అందించిన పుతిన్
మాస్కో, డిసెంబర్ 24: రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలువైన, అరుదైన కానుకలు ఇచ్చారు. బెంగాల్‌కు చెందిన 18వ శతాబ్దపు కత్తిని, మహాత్మాగాంధీ చేతిరాతలతో కూడిన ఆయన డైరీలోని ఒక పేజీని కానుకగా అందజేసారు. బుధవారం రాత్రి క్రెమ్లిన్‌లో ఇరువురు నేతలు కలిసినప్పుడు పుతిన్ మోదీకి ఈ కానుకలు ఇచ్చారు. బెంగాల్‌కు చెందిన 18వ శతాబ్దపు కత్తి నజాఫి వంశానికి చెందినది.
మాస్కో వార్ మెమోరియల్ సందర్శన
మోదీ గురువారం ఉదయం మాస్కోలోని రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన రష్యా సైనికుల స్మారకార్థం నిర్మించిన అజ్ఞాత సైనికుడి సమాధిని సందర్శించి సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచారు. మాస్కోలోని అలెగ్జాండర్ గార్డెన్‌లో ఉన్న క్రెమ్లిన్ వాల్ వద్ద ఈ మెమోరియల్ ఉంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా మోదీ సమాధి వద్ద వెలుగుతున్న జ్యోతి వద్ద కొద్ది నిమిషాల పాటు నిలుచున్నారు. సమాధిపైన ఉన్న రాగి ఫలకంపై ‘మీ పేరు అజ్ఞాతం, మీ సాహసం అమరం’ అనే అక్షరాలుంటాయి. 1941 మాస్కో యుద్ధంలో మృతి చెందిన అజ్ఞాత సైనికుల మృత దేహాలను తొలుత జెలెనోగ్రాడ్ సిటీ సమీపంలోని లెనిన్‌గ్రాడ్ హైవేపై 40వ కిలోమీటర్ వద్ద సామూహిక ఖననం చేసారు.ఈ యుద్ధం 25వ వార్షికోత్సవం సందర్భంగా 1966 డిసెంబర్‌లో ఈ అవశేషాలను క్రెమ్లిన్ వాల్ వద్దకు తరలించారు. ఈ అజ్ఞాత సైనికుడి సమాధిని ఆర్కిటెక్చర్లు డిఐ బుర్డిన్, విఐ కిల్మోవ్, యుఆర్ రబయేవ్, శిల్పి నికలోయి డామ్‌స్కీలు కలిసి డిజైన్ చేసారు. 1967 మే 8న ఈ మెమోరియల్‌ను ప్రజల సందర్శనార్థం తెరిచారు. సమాధికి ఎడం వైపున ‘1941నుంచి 1945 వరకు మాతృభూమికోసం అసువులు బాసిన వారికోసం’ అన్న అక్షరాలు చెక్కి ఉన్న ఓ గ్రానైట్ గోడ ఉంటుంది. సమాధికి కుడి వైపున వివిధ నగరాలనుంచి తెచ్చిన మట్టితో చేసిన ఫలకాలతో చేసిన ఒక గ్రానైట్ సముదాయం ఉంటుంది.