జాతీయ వార్తలు

లోక్‌సభకు కేవీపీ ప్రైవేటు బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును లోక్‌సభ స్పీకర్‌కు పంపుతామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ శుక్రవారం ప్రకటించారు. ప్రైవేటు బిల్లుపై ఓటింగ్‌కు సిద్ధంగా ఉందని, ఇప్పుడు మళ్లీ చర్చించలేమని చెప్పారు. మనీ బిల్లు అవునా? కాదా? నిర్ణయించే అధికారం రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు లేదన్నారు. ప్రైవేటు బిల్లు మనీ బిల్లు అవునా? కాదా? అని లోక్‌సభ స్పీకర్ తేలుస్తారని చెప్పారు. దీనిపై కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.