యువ

క్విజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రం వచ్చాక మన దేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడటానికి, ఆ తరువాతి పరిణామాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విశేషాలు కొందరికి తెలుసు.. కొందరికి తెలియకపోవచ్చు. నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని అంశాలపై సమాచారం ఎంతవరకు తెలుసో కనుగొనేందుకు ఈ ‘క్విజ్’...
1. ఏ దేశం రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే భావనలు తీసుకోబడ్డాయి?
జ: ఎ. స్విట్జర్లాండ్ బి. యునైటెడ్ కింగ్‌డమ్ సి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు డి. ఫ్రాన్స్
2. భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారాక పరమవీర్ చక్ర పురస్కారం ప్రదానం చేస్తోంది. అంతకుముందు పరమవీర్‌చక్ర స్థానంలో ఇచ్చే పురస్కారం పేరు?
జ: ఎ.విక్టోరియా క్రాస్ బి.మిలటరీ మెరిట్ సి.ది మెడల్ ఆఫ్ ఆనర్ డి.ది హీరోస్ మెడల్
3. గణతంత్ర దినోత్సవ వేడుకలు పరేడ్ ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో 1955 నుంచి నిర్వహిస్తున్నారు. 1950 నుంచి 1954 వరకు ఆ పరేడ్ ఎక్కడ నిర్వహించారు?
జ: ఎ.ఇర్విన్ అమ్ఫి థియేటర్ (ప్రస్తుత ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియం) బి.కింగ్స్‌వే క్యాంపు సి.ఎర్రకోట-రామ్‌లీల మైదానాలు డి.పైన పేర్కొన్నవన్నీ
4. గణతంత్ర దినోత్సవం నాడు మనదేశ సైనిక పరాక్రమం, విజయాలు ఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద పరేడ్‌లో ప్రదర్శిస్తున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు సంబంధించి ఏ విశేషం గిన్నిస్ పుస్తకంలో నమోదయింది. ఇంకా ప్రపంచంలోనే మరే దేశంలో కూడా కనబడని ప్రత్యేకత ఏమిటి?
జ: ఎ. పదాతిదళం బి.మోటార్ సైకిల్ దళ ఫీట్లు సి. ఒంటెపై కూర్చున్న సైనిక ప్రదర్శన, బ్యాండు మేళం డి.మహిళా సైనికుల అశ్వదళం
5. గణతంత్ర భారత దేశ మొదటి అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్రఫ్రసాద్ తనకున్న ఏ అధికార వాహనంలో (స్టేట్‌కోడ్) రాష్టప్రతి భవనం నుండి పరేడ్ మైదానానికి వెళ్లారు?
జ: ఎ.బులెటప్రూఫ్ కాంటెస్సా కారు బి.హిందూస్థాన్ అంబాసిడర్ మార్క్ వన్ కారు సి.విల్లీస్ వేగన్ జీప్ డి.గుర్రపు బగ్గీ
6. హిందీ, ఆంగ్లంలో చేతితో రాసిన భారత రాజ్యాంగం అసలు కాపీలు కాలిగ్రాఫ్ చేశారు. ఇవి ఎక్కడ, ఎలా భద్రపరిచారు?
జ: ఎ.నేషనల్ లైబ్రరీలో నైట్రోజన్ వాయువు నింపిన లాకర్లో భద్రపరిచారు
బి.పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇనపపెట్టెలో ఉన్నాయి.
సి.్భరత పార్లమెంటులో హీలియం నింపిన బాక్సుల్లో అవి భద్రపరచబడ్డాయి
డి.్భరత సుప్రీంకోర్టు లైబ్రరీలో బైండింగ్ చేసి ఉంచారు
7. 1950 నుండి న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు మరొక దేశం ప్రభుత్వాధిపతిని ముఖ్య గౌరవ అతిథిగా ఆహ్వానిస్తున్నాము. అతిథిగా ఆహ్వానించే దేశాన్ని ఎన్నుకోవడానికి ఏ విషయాలు పరిగణనలోకి తీసుకొంటారు?
జ: ఎ.లోక్‌సభలో ఓటింగ్ జరిపి మెజారిటీ సభ్యులు ఓటువేసిన దేశాధిపతి
బి.కేవలం మిత్రదేశాల మరియు కామన్‌వెల్త్ దేశాల అధిపతులు
సి.్భరతదేశ ప్రథమ పౌరుడి సంకల్పం, కోరిక ప్రకారం
డి .్భరతదేశ ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక ప్రయోజనాల దృష్టిలో..
8. బాబూ రాజేంద్రప్రసాద్ భారతదేశానికి మొదటి అధ్యక్షుడై అధికారిక భవనంలోకి మకాం మార్చినపుడు దానిపేరు రాష్టప్రతి భవన్‌గా మార్చారు. 26 జనవరి 1950కి ముందు ఇప్పటి రాష్టప్రతి భవనాన్ని ఏమని పిలిచారు?
జ : ఎ.గవర్నమెంట్ హౌస్ బి.వైస్రాయ్ హౌస్ సి.గవర్నర్ జనరల్ ప్యాలెస్ డి.పైన పేర్కొన్నవన్నీ
9. ఏ పారామిలటరీ దళం జనవరి 26, 2017లో రాజ్‌పథ్ గణతంత్ర పరేడ్‌లో మొట్టమొదటిసారి పాల్గొని వారి అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శించి కనువిందు చేసి సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
జ: ఎ.అస్సాం రైఫిల్స్ బి.శాస్ట్రా సీమ బల్ (ఎస్‌ఎస్బీ) సి.నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జి) డి.ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)
10. ప్రతి రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశ అధ్యక్షుడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ఇచ్చే తేదీ, ప్రదేశం ఏది?
జ: ఎ.జనవరి 25, రాష్టప్రతి భవన్ నుంచి
బి.జనవరి 26 రైసినాహిల్స్ వద్ద
సి.జనవరి 29 విజయ్‌చౌక్ వద్ద
డి.జనవరి 24 ఇండియా గేటు వద్ద
11.్భరత రాజ్యాంగం ఏర్పరచడానికి రాజ్యాంగ సభ ఎంత సమయం తీసుకుంది?
ఎ.1 సంవత్సరం 11 నెలల 9 రోజులు
బి.2 సంవత్సరాల 8 నెలల 24 రోజులు
సి.2 సంవత్సరాల 4 నెలల 11 రోజులు
డి.2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు
12. ఏ సంవత్సరంలో ఏ ప్రధానమంత్రి ప్రభుత్వంలో మన రాజ్యాంగం ముందు ప్రతికి ‘సోషలిస్టు లౌకిక’ అనే పదం చేర్చారు. చేర్చిన పిమ్మట ‘సార్వభౌమ సోషలిస్ట్ సెక్యులర్ డెమొక్రటిక్ రిపబ్లిక్’ అని పేర్కొనబడింది?
ఎ.1998లో అటల్ బిహారీ వాజపేయి
బి.1978లో మొరార్జీ దేశాయ్
సి.1976లో ఇందిరాగాంధీ
డి.1985లో రాజీవ్‌గాంధీ
‘ఆంధ్రభూమి’ పాఠకుల కోసం వారం వారం అందించే తొలి ‘క్విజ్’ ఇది.
ఈ వారం ప్రశ్నలకు వచ్చేనెల 2వ తేదీలోగా సరైన సమాధానాలు
రాసి పంపిన వారి పేర్లను ప్రచురిస్తాం.
చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి, 36, సరోజినీ దేవీ రోడ్, సికిందరాబాద్- 500 003

- సునీల్ ధవళ, 09741747700