క్విజ్

మహాభారత స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. పాండవుల అజ్ఞాతవాసం జరిపిన విరాటరాజు కొలువు, ఆ మత్స్యరాజు పాలించిన రాజ్యం ప్రస్తుతం ఎక్కడ ఉంది?
ఎ.బిరాట్ నగర్, నేపాల్ బి.బిరాట్ ఫుట్, ఒరిస్సా
సి.విరాట్పూర్, మధ్యప్రదేశ్ డి.విరాట్ పట్టణం, తమిళనాడు
2.పోర్బందర్, గుజరాత్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో గల రనవావ్ గ్రామంలో ఏ ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఉంది?
ఎ.పాండవుల లక్క ఇల్లు బి.మయసభ
సి.గోవర్ధన పర్వతం డి.జాంబవంతుడి గుహ
3.పురాణాల ప్రకారం భూదేవికి వరాహావతారంలో ఉన్న విష్ణుమూర్తికి పుట్టిన రాక్షసుడెవరు?
ఎ.బాణాసురుడు బి.నరకాసురుడు
సి.తారకాసురుడు డి.బకాసురుడు
4.నరకాసురుడు నిర్మించి పాలించిన ప్రగ్జ్యోతిశ రాజ్యం ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఉంది?
ఎ.బ్రహ్మపుత్ర వ్యాలీ, అస్సాం
బి.్భటాన్, బీహార్
సి.బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్
డి.పైవన్నియూ
5.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినికి రెండు కిలోమీటర్ల దూరంలో ఏ ప్రసిద్ధి గాంచిన ఆశ్రమం ఉంది?
ఎ.సాందీప ముని ఆశ్రమం బి.పరశురాముడి ఆశ్రమం
సి.కుచేలుడు ఆశ్రమం డి.దూర్వాసముని ఆశ్రమం
6.ద్రుపదుడు పరిపాలించిన పాంచాల రాజ్యం రాజధాని కంపిల్యా నగరం ఇపుడు ఏ జిల్లాలో ఉంది?
ఎ.్ఫరోజాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్
బి.ఫైజాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్
సి.్ఫరుక్వాబాద్ జిల్లా, ఉత్తరప్రదేశ్
డి.రాంపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్
7.నిశద రాజ్యానికి చెందిన ఏకలవ్యుడు నివసించిన ప్రాంతం ఎక్కడ ఉంది?
ఎ.అరావళి శ్రేణులు, రాజస్థాన్
బి.దండకారణ్యం, అరకు వ్యాలీ
సి.కిష్కింధ, కర్ణాటక
డి.నీలగిరి, తమిళనాడు
8.రుక్మిణి తండ్రి భీష్మకుడు ఏ రాజ్యానికి రాజు? ఇపుడా ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ.విదర్భ, మహారాష్ట్ర
బి.కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్
సి.వడోదర, గుజరాత్
డి.అలహాబాద్, ఉత్తరప్రదేశ్
9.అంబ, అంబిక, అంబాలికలు ఏ రాజ్య యువరాణులు?
ఎ.సాల్వ రాజ్యం బి.మగధ రాజ్యం
సి.కాశ్మీరు రాజ్యం డి.కాశీ రాజ్యం
10.ఇప్పటి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ వద్ద ఉన్న భాగ్పట్ గ్రామంలో హిండాన్ నది ఒడ్డున భారతంలోని ఏ కీలక అంశం జరిగింది?
ఎ.కృష్ణుని అరచేతిలో గయుడు కిళ్లీ ఉమ్మివేయుట
బి.విదురుని జననం
సి.పాండవుల లక్క ఇల్లు దహనం
డి.కుంతీదేవి కర్ణుడుని నదిలో వదిలిపెట్టుట
*
గత వారం క్విజ్ సమాధానాలు
1.డి 2.సి 3.సి 4.డి 5.బి 6.ఎ 7.డి 8.సి 9.సి 10.ఎ

-సునీల్ ధవళ 97417 47700