క్విజ్

నో టొబాకో డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.నికోటిన్ మానవ శరీరానికి ఏమి హాని కలిగిస్తుంది?
ఎ.హృదయ స్పందనని వేగవంతం చేస్తుంది
బి.కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావితం చూపిస్తుంది
సి.పొగాకు అలవాటుపడి, వ్యసనంగా మారి బానిస చేస్తుంది
డి.పైవన్నియు
2.పొగాకులో ఉండే కార్బన్ మోనాక్సైడ్ మన శరీరంలో ఏ దుప్ప్రభావం చూపుతుంది?
ఎ.పొగాకు కాల్చినపుడు విషపూరిత వాయువు ఉత్పత్తి చేస్తుంది
బి.ఎర్ర రక్తకణాలు శరీరానికి సరిపడే ఆక్సిజన్ సరఫరా చేయకుండా నిరోధిస్తుంది
సి.మెదడుకు ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం కలిగిస్తుంది
డి.పైవన్నియు
3.పొగాకుతో చేసిన సిగరెట్లు, చుట్టలు, బీడీ, ఖైనీ, గుట్కాలు ఎన్ని కేన్సర్ కారకాలు లేదా కార్సినోజెన్లకు కారణమవుతున్నాయి?
ఎ.16 బి.28
సి.30 డి.60కన్నా ఎక్కువ
4.క్రింది వాటిలోని ఏ పదార్థాల నుండి సేకరించిన రసాయనాలు సిగరెట్లలో లభ్యమవుతాయి?
ఎ.రాకెట్ ఇంధనం, నెయిల్ పోలిష్ రిమూవర్
బి.కొవ్వొత్తి మైనం సి.బ్యాటరీల పొడి డి.పైవన్నియు
5.్ధమపానం మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల అలవాటు మానుట కొరకు ఎవరిని సంప్రదించాలి?
ఎ.డ్రగ్స్ పునరావాస కేంద్రం బి.పొగాకు విరమణ కేంద్రం
సి.పొగాకు వ్యసన విముక్తి కేంద్రం డి.పైవన్నియు
6.సాంఘిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో పొగాకు, డ్రగ్ అలవాటు చికిత్సలో ఏ సంస్థలు పని చేస్తున్నాయి?
ఎ.నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్‌టిసిపి)
బి.నేషనల్ టొబాకో కంట్రోల్ సెల్ (ఎన్‌టిసిసి)
సి.ఇంటిగ్రేటెడ్ రిహెబిలిటేషన్ సెంటర్ ఫర్ అడిక్ట్స్
డి.పైవన్నియు
7.పొగాకు అలవాటు వలన ఏ ఇతర దుష్ప్రభావాలు కల్గుతాయి?
ఎ.మొహంలో ముడతలు పడటం, గోళ్లు పసుపురంగులో మారడం
బి.చెడు శ్వాస, దంతాలు నలుపు, పసుపు రంగులో మారడం
సి.దంతక్షయం మరియు పళ్లు ఊడిపోవడం
డి.పైవన్నియు
8.పొగాకును ఉపయోగించడం వల్ల ఏ హానికరమైన ఆరోగ్య ప్రభావాలు, ప్రాణాంతకమైన వ్యాధులు కలగడానికి ఆస్కారముంది?
ఎ.నోటి కేన్సర్, గొంతు కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్
బి.అధిక రక్తపోటు
సి.గుండె జబ్బులు, గుండెపోటు మరియు స్ట్రోక్
డి.పైవన్నియు
9.ఆంధ్రప్రదేశ్‌లోని ఏ గ్రామాన్ని పొగాకు రహిత గ్రామంగా ప్రకటించబడింది?
ఎ.పొంగలిపాక బి.ఆరిపాక
సి.ముదపాక డి.మునంపాక
10.ఇతరుల ధూమపానం వలన ఆ పొగ పీల్చే పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి?
ఎ.చెవి, ముక్కు మరియు గొంతు సమస్యలు
బి.శ్వాసకోశ సమస్యలు మరియు గుండె జబ్బులు
సి.ఉబ్బసం మరియు న్యుమోనియా
డి.పైవన్నియు

గత వారం క్విజ్ సమాధానాలు:
-----------------------------------
1.ఎ 2.డి 3.బి 4.డి 5.ఎ 6.సి 7.ఎ 8.ఎ 9.డి 10.సి

-సునీల్ ధవళ 97417 47700