క్విజ్

శే్వత విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. భారతదేశంలో శే్వత విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1967
బి) 1970
సి) 1972
డి) 1978
2. క్రింది వారిలో భారత శే్వత విప్లవ పితామహుడు ఎవరు?
ఎ) వర్ఘీస్ చెరియన్
బి) హెచ్. ఎం. డాలయ
సి) వర్గీస్ కురియన్
డి) అమూల్ పాలేకర్
3. శే్వత విప్లవం యొక్క లక్ష్యం ఏమిటి?
ఎ) పాలు ఉత్పాదకత పెంచడం
బి) మార్కెట్లో పాలకు గిట్టుబాటు ధర లభించడం, సామాన్యులకు పాలు అందుబాటు ధరలో లభ్యం
సి) ప్రపంచంలోని అతి పెద్ద పాల ఉత్పత్తిదారులలో ఒకటిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం
డి) పైవన్నియు
4. శే్వత విప్లవ లక్ష్యాన్ని సాధించడానికి ఏ పద్ధతులు అవలంభించారు?
ఎ) పాల ఉత్పత్తిరంగంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికత పరికరాల ఉపయోగం
బి) వివిధ చిన్న, పెద్ద పాడి పరిశ్రమల మధ్య అనుసంధానం
సి) గ్రామస్థాయిలో పాల సహకార సంఘాల ఏర్పాటు, ఆరోగ్యకరమైన పశుజాతి ఉత్పత్తి
డి) పైవన్నియు
5. ఏ రాష్ట్రాలలో అత్యధిక తలసరి పాల వినియోగం ఉంది?
ఎ) గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్
బి) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్
సి) హర్యానా, పశ్చిమ బెంగాల్, మిజోరం
డి) పంజాబ్, మధ్యప్రదేశ్, కేరళ
6. 1960లలో శే్వత విప్లవంకు ముందు భారతదేశం యొక్క పాల ఉత్పత్తి సాలీన ఎంత?
ఎ) 12 - 17 మిలియన్ టన్నులు
బి) 17 - 22 మిలియన్ టన్నులు
సి) 28 - 33 మిలియన్ టన్నులు
డి) 35 - 40 మిలియన్ టన్నులు
7. 2017లో పాల ఉత్పత్తిలో భారతదేశం 5.5 శాతం వార్షిక వృద్ధి రేటుతో ప్రపంచ పటానికెక్కింది. ప్రపంచ సగటు వృద్ధి రేటు ఎంత?
ఎ) 2.1%
బి) 2.5%
సి) 7.2%
డి) 7.8%
8. 2017-18కి గానూ భారతదేశం యొక్క పాల ఉత్పత్తి ఎంత?
ఎ) 56 మిలియన్ టన్నులు
బి) 112 మిలియన్ టన్నులు
సి) 138 మిలియన్ టన్నులు
డి) 165 మిలియన్ టన్నులు
9. భారతదేశంలో 2017లో పాల తలసరి లభ్యత ఎంత?
ఎ) 1500 గ్రాములు/దినం
బి) 980 గ్రాములు/దినం
సి) 725 గ్రాములు/దినం
డి) 355 గ్రాములు/దినం
10. తూర్పు ఆసియాలో 90 శాతం వరకు ప్రజలు పాలను జీర్ణించుకోలేరు. ఎవరికైనా పాలు జీర్ణం అవ్వకపోవడం, పడకపోవడాన్ని వైద్య పరిభాషలో ఏమంటారు?
ఎ) క్రోహేన్స్ డిసీజ్
బి) మిల్క్ ఎలర్జీ
సి) లాక్టోజ్ ఇంటొలరెన్స్
డి) వైట్ ఎలర్జీ
*
గత వారం క్విజ్ సమాధానాలు
1.డి, 2. డి, 3. డి, 4. డి, 5. డి, 6. డి, 7. డి, 8. డి, 9. ఎ, 10. డి, 11. డి, 12. డి

-సునీల్ ధవళ 97417 47700