క్విజ్

వివిధ పశువుల జాతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. ఎర్ర సింధి ఆవు లేదా పశువుల జాతికి మూలం ఏ ప్రాంతం?
ఎ) కరాచీ మరియు పంజాబ్ (పాకిస్థాన్)
బి) కరాచీ మరియు హైదరాబాద్ (పాకిస్థాన్)
సి) ఎ అండ్ బి
డి) హైదరాబాద్ (పాకిస్థాన్)
2. ఎర్ర సింధీ జాతి ఆవుకున్న ఇతర పేర్లు ఏమిటి?
ఎ) రెడ్ కరాచీ మరియు రెడ్ సింధీ
బి) సింధీ మరియు మహీ
సి) మోంట్గోమేరీ
డి) ఎ అండ్ బి
3. గుజరాత్, మహారాష్ట్ర మరియు సమీప రాజస్థానుకు చెందిన గిర్ జాతి ఆవులకున్న మరో పేర్లేమిటి?
ఎ) భదవరి, దేశన్
బి) గుజరాతీ, కతియారి
సి) క్రమీహి, సూరతి
డి) పైవన్నియు
4. షహివాల్ పశువుల జాతి ఎక్కడ నుండి పుట్టింది?
ఎ) పంజాబ్, పాకిస్థాన్
బి) ఇస్లామాబాద్, పాకిస్థాన్
సి) హైదరాబాద్, భారతదేశం
డి) హర్యానా, భారతదేశం
5. షహివాల్ జాతికి చెందిన ఆవులు, ఎద్దులకున్న ఇతర పేర్లు ఏమిటి?
ఎ) మోంట్గోమేరీ, టెలి, లోలా
బి) లాంబి బార్, ముల్తానీ
సి) ఎ అండ్ బి
డి) మహీ
6. వైట్ సింధీ, గ్రే సింధీ మరియు థారీ అని గుర్తింపబడే పశువుల జాతి యొక్క ప్రాథమిక పేరు ఏమిటి?
ఎ) తర్పార్కర్
బి) హరియానా
సి) అమృత్మహల్
డి) కంగాయం
7. క్రింది వానిలో ఏ జాతి తెలుగు రాష్ట్రాలకు చెందినది?
ఎ) ఒంగోలు, డియోనీ, పుంగనూరు, మోటు
బి) ఒంగోల్, హల్లికార్, రెడ్ కందారీ, డంగీ
సి) అమృత్మహల్, ఒంగోలు, వేజూర్, బింజ్హరిపూరి
డి) ఖిల్లారి, ఒంగోలు, గూమ్సారి, బాచూర్
8. జెర్సీ జాతి ఆవు ఏ ప్రాంతానికి చెందినది?
ఎ) నెదర్లాండ్స్
బి) జెర్సీ ఐలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్
సి) స్కాట్లాండ్
డి) డెన్మార్క్
9. క్రిందివానిలో ఏ పశువుల జాతి తమిళనాడుకు చెందినది?
ఎ) తర్పార్కర్
బి) బర్గుర్ మరియు ఉబ్లాచెరి
సి) పులికుళం, ఆలంబడి మరియు కంగాయం
డి) బి అండ్ సి
10. ఏ రెండు జాతుల సంక్రమణ ద్వారా ఎన్.డి.ఆర్.ఐ. కర్నాల్‌లో కరణ్ స్విస్ అనే సంకరజాతి ఆవును పుట్టించారు?
ఎ) జెర్సీ జాతికి, గిర్ జాతితో
బి) జెర్సీ జాతికి ఒంగోలు జాతికి మధ్య
సి) బ్రౌన్ స్విస్, స్విట్జర్లాండ్ జాతితో షహివాల్ జాతి
డి) బ్రౌన్ స్విస్ స్విట్జర్లాండ్ జాతికి రెడ్ సింధీకి

*
గత వారం క్విజ్ సమాధానాలు
1. బి, 2. సి, 3. డి, 4. డి, 5. ఎ, 6. బి, 7. ఎ, 8. డి, 9. డి, 10. సి

-సునీల్ ధవళ 97417 47700