క్విజ్

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.లోపలి మనిషి (ఇన్‌సైడర్) అనే ఆత్మకథ రాసిన పి.వి.నరసింహారావు గారు క్రింద ఉన్న పుస్తకాలలో ఏది రచించారు?
ఎ.అయోధ్య, డిసెంబర్ 1992
బి.అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్, జూన్ 1984
సి.న్యూఢిల్లీ, అక్టోబర్ 1984
డి.కారంచేడు, జులై 1985
2.1962-71ల మధ్య పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏ మంత్రిత్వ శాఖను చేపట్టారు?
ఎ.న్యాయ మరియు సమాచార మంత్రిత్వ శాఖ
బి.దేవాదాయ మరియు విద్యాశాఖ
సి.ఆరోగ్య మంత్రిత్వ శాఖ
డి.పైవన్నియు
3.పి.వి.నరసింహారావు ఏ సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించారు?
ఎ.1968-71 బి.1971-73
సి.1970-75 డి.1971-76
4.దిగువనీయబడిన ఏ పదవులు పి.వి.నరసింహారావు గారిని 1960-77ల మధ్య వరించాయి?
ఎ.ప్రధాన కార్యదర్శి, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ
బి.చైర్మన్, తెలుగు అకాడెమీ, ఆంధ్రప్రదేశ్
సి.వైస్ ప్రెసిడెంట్, దక్షిణ భారత్ హిందీ ప్రచారసభ, మద్రాస్
డి.పైవన్నియు
5.ప్రధాని కాకముందు, దిగువనీయబడిన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖను పి.వి.నరసింహారావు నిర్వహించారు?
ఎ.విదేశీ వ్యవహారాల మంత్రి
బి.హోంశాఖ మంత్రి
సి.రక్షణ మంత్రి మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రి
డి.పైవన్నియు
6.బహుభాషా కోవిదుడు, పండితుడు, రచయిత మరియు పాత్రికేయుడు అయిన పి.వి.నరసింహారావు యువకునిగా ఉన్నపుడు ఏ తెలుగు వారపత్రికను ప్రారంభించి సంపాదకులుగా వ్యవహరించారు?
ఎ.కాకతీయ పత్రిక బి.కృష్ణా పత్రిక
సి.వంగర వారపత్రిక డి.ఓరుగల్లు పత్రిక
7.పి.వి.నరసింహారావు అతని బంధువుతో కలిసి ఏ కలం పేరు/ మారు పేరుతో పత్రికకు వ్యాసాలను రాసేవారు?
ఎ.జయ్-విజయ్
బి.లవ-కుశ
సి.రాముడు-్భముడు
డి.అగ్ని-జమదగ్ని
8.ఆర్థిక మంత్రి పదవికి మన్మోహన్‌సింగ్ కన్నా ముందు ఏ వ్యక్తిని పీవీ నరసింహారావు మొట్టమొదటి ఎంపిక చేశారు?
ఎ.ప్రణబ్ ముఖర్జీ
బి.మాంటెక్ సింగ్ అహ్లువాలియా
సి.ఐ.జి.పటేల్
డి.అమర్త్యసేన్
9.క్రింది వానిలో పి.వి.నరసింహారావు సాధించిన ఘనత ఏది?
ఎ.దక్షిణ భారతదేశం నుంచి మొదటి వ్యక్తి భారత ప్రధానమంత్రి
బి.నెహ్రూ - గాంధీ వంశీయేతరుడై ఐదు సంవత్సరాలు పూర్తి పదవీ కాలం చేసిన మొదటి ప్రధానమంత్రి
సి.మెజారిటీ లేకున్నా సంకీర్ణం లేకుండా ఒకే ఒక పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి నాయకత్వం వహించిన చివరి ప్రధానమంత్రి
డి.పైవన్నియు
10.లాల్ బహదూర్ శాస్ర్తీ తర్వాత పి.వి.నరసింహారావే అత్యుత్తమ ప్రధానమంత్రి అని ఏ ప్రతిపక్ష నేత పీవీని పార్లమెంటులో కొనియాడారు?
ఎ.బాల్ థాకరే బి.అటల్ బిహారీ వాజ్‌పేయి
సి.జ్యోతిబసు డి.లాల్‌కృష్ణ అద్వానీ
11.హరినారాయణ్ ఆప్టే యొక్క ప్రసిద్ధ మరాఠీ నవల ‘పాన్ లక్షణ్ కొన్ గెటో’ని ఏ పేరుతో పి.వి.నరసింహారావు తెలుగులో అనువదించారు?
ఎ.అబల సబల
బి.అబల జీవితం
సి.మహిళా జాగరణ మహోద్యమం
డి.బలిపీఠం
12.క్రింది వాటిలో పి.వి.నరసింహారావు యొక్క ప్రధాన ఆర్థిక సంస్కరణలు ఏవి?
ఎ.1994లో కంప్యూటర్ - ఆధారిత నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ స్థాపించడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు
బి.సెబీ చట్టం 1992 ప్రవేశపెట్టడం, గ్లోబల్ డిపాజిటర్ రిసిప్ట్స్ జారీకి భారత సంస్థలను అనుమతించడం
సి.సుంకాలు తగ్గించడం, క్యాపిటల్ కంట్రోలర్‌ని నిషేధించడం, ఎఫ్‌డిఐ పరిమితులను పెంచి ప్రోత్సహించడం
డి.పైవన్నియు

-సునీల్ ధవళ 97417 47700