క్విజ్

వామనుడి మూడో అడుగు ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.బలి చక్రవర్తి తాతగారు ఎవరు?
ఎ.హిరణ్య కశిపుడు
బి.ప్రహ్లాదుడు
సి.విరోచనుడు
డి.్భృగుమహర్షి
2.బలి చక్రవర్తి గురువు ఎవరు?
ఎ.సాందీప మహాముని
బి.కశ్యపు ముని
సి.శుక్రాచార్యుడు
డి.్భృగు మహర్షి
3.వామనుడు అడిగిన మూడడుగుల భూమి దానం ఇవ్వబోతూండగా బలి చక్రవర్తిని అడ్డుకున్నది ఎవరు?
ఎ.హిరణ్యకశిపుడు బి.శుక్రాచార్యుడు
సి.సూర్యుడు డి.అధితి
4.దానం ఇచ్చే ముందు ఉదకం ధార పడకుండా బలి చక్రవర్తి చేతిలోని కమండలంలో దూరిన శుక్రాచార్యుడు కన్ను ఎలా పోగొట్టుకుంటాడు?
ఎ.వామనుడు దర్భతో కమండల వాహికను పొడవడం వలన
బి.బలి చక్రవర్తి దర్భతో కమండల వాహికను పొడవడం వలన
సి.గంగ ఉధృత ప్రవాహానికి
డి.వామనుడు తేనెటీగగా మారి కమండలంలో దూరడం వలన
5.ఈ పద్యాన్ని ఎవరు రచించారు?
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁదా నింతై నభోవీథిపై
నంతైతోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతైచంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతైసత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్థియై
ఎ.బమ్మెర పోతన బి.అల్లసాని పెద్దన
సి.్ధర్జటి
డి.తిరుపతి వేంకట కవులు
6.శ్రీ మహావిష్ణువు, వామన అవతారం ఎత్తడానికి ఎవరి కడుపున పుడతాడు?
ఎ.అధితి బి.శారద
సి.అహల్య డి.వసుంధర
7.ఎవరి వద్ద వరం తీసుకొని ఇంద్రుడుని జయించడానికి బలి చక్రవర్తి వెళతాడు?
ఎ.్భళా శంకరుడు బి.వశిష్టుడు
సి.బ్రహ్మ డి.విశ్వకర్మ
8.వామనుడు మూడో అడుగు బలి చక్రవర్తిపై వేయగా బలి ఎక్కడకు చేరుకొంటాడు?
ఎ.స్వర్గ లోకం బి.సత్య లోకం
సి.్భవర లోకం డి.పాతాళ లోకం
9.ఈ పద్యాన్ని ఎవరు ఏ సందర్భంలో చెప్పారు?
వారిజాక్షులందు వైవాహికములందు, బ్రాణమానవిత్త భంగమందు
జకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు, బొంకవచ్చు నఘము వొంద దధిప
ఎ.శుక్రాచార్యుడు బలి చక్రవర్తికి
బి.శుక్రాచార్యుడు వామనుడితో
సి.మహావిష్ణువు బ్రహ్మతో
డి.వామనుడు బలి చక్రవర్తితో
10.ఈ పద్యం ద్వారా వామనుడు ఏమి అడిగేడు?
గొడుగో జన్నిదమో కమండలువో నాకున్ ముంజియో దండమో
వడుగేనెక్కడ భూముల్కెడ కరుల్ వామాక్షులశ్వంబులె
క్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూ
డడుగుల్ మేరయ త్రోవకిచ్చుటయే బ్రహ్మాండంబు నా పాలికిన్
ఎ.బ్రహ్మచారికి కావలసినవి, దగ్గర ఉండవలసినవి, కోరుకోదగినవి
బి.మూడు లోకాలకు సరిపడే భూమి, వెయ్యి అశ్వాలు, ఏనుగులు
సి.మూడు అడుగుల భూమి
డి.ఎ అండ్ సి

గత వారం క్విజ్ సమాధానాలు:
-------------------------------------
1.ఎ 2.డి 3.బి 4.డి 5.డి 6.ఎ 7.ఎ 8.సి 9.డి 10.డి 11.బి 12.డి

--సునీల్ ధవళ - 97417 47700