క్విజ్

‘గజేంద్ర మోక్షం’ ఎక్కడ జరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.ఏ రాజు ఒక మునిచేత శాపగ్రస్థుడై ఏనుగుగా మారిపోతాడు?
ఎ.చిత్రసేనుడు బి.ప్రసేన్జిత్
సి.బూరీశ్వరుడు డి.ఇంద్రద్యుముడు
2.రాజు హరినామస్మరణలో లీనమై పోయి ఏ మునివర్యుడి రాక గమనింపక ఆ ముని కోపానికి శాపగ్రస్థుడై ఏనుగుగా మారేడు?
ఎ.దూర్వాసముని బి.జమదగ్ని
సి.్భృగు మహర్షి డి.అగస్థ్య ముని
3.ఏ గంధర్వుడు ఒక మహర్షి చేత శాపగ్రస్థుడై మొసలిగా మారిపోతాడు?
ఎ.చిత్రాంగదుడు బి.చిత్రరధుడు
సి.హూహూ డి.విశ్వవాసు
4.సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్న ఏ ముని కాళ్లు పట్టుకుని ఆ గంధర్వుడు నీటిలోకి లాగేడు?
ఎ.నచికేతుడు బి.మార్కండేయుడు
సి.వైశంపాయనుడు డి.దేవల మహర్షి
5.ఆ ముని కాళ్లు పట్టుకుని లాగడంలో గంధర్వుడి ఆంతర్యం ఏమిటి?
ఎ.ఆ మునితో వైరం ఉన్నందున
బి.అప్సరసలతో జలకాలాడుతూ అప్సరస కాళ్లు అనుకొని
సి.ఆ ముని ఉగ్రుడో, శాంతమూర్తో తెలుసుకోడానికి
డి.ఆ ముని తమ ఏకాంతంకు భంగం వాటిల్లజేసినందుకు
6.గజేంద్ర మోక్షం ఎవరు రచించేరు?
ఎ.వ్యాస భాగవతంలో మరియు పోతన తెలుగు భాగవతంలో అధ్యాయం
బి.పోతన భాగవతంలో అష్టమోధ్యాయం
సి.వాల్మీకి రామాయణంలో సుందరకాండలో అధ్యాయం
డి.గరుడ పురాణంలో అధ్యాయం
7.గజేంద్ర మోక్షం గురించి ఎవరు ఎవరికి వినిపించారు?
ఎ.సుఖ మహర్షి, పరీక్షిత్తు మహారాజుకి
బి.సూత మహాముని ప్రహ్లాదుడికి
సి.బేతాళుడు విక్రమార్కుడుకి
డి.అంపశయ్య మీద భీష్ముడికి శ్రీకృష్ణుడు
8.గజేంద్ర మోక్షం జరిగిన త్రికూట పర్వతం ప్రస్తుతం ఎక్కడ ఉంది?
ఎ.పావనాశం, తిరుమల
బి.పావనాశం, తంజావూరు జిల్లా తమిళనాడు
సి.పాపనాశం, కుంభకోణం దగ్గిర, తమిళనాడు
డి.బి అండ్ సి
9.ఈ పద్యం ఏ సందర్భంలోనిది?
‘సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం జేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణా వనోత్సాహి యై’
ఎ.తన నామస్మరణ చేసి శరణం అడిగిన ఏనుగును కాపాడటానికి విష్ణువు హఠాత్తుగా బయలుదేరిన తీరు
బి.ఆ తొందరలో మహాలక్ష్మికి చెప్పకుండా, శంఖం, విష్ణుచక్రం వదిలేసి బయల్దేరిన రీతి
సి.వాహనం గరుడు, పరిచారకులకు కూడా చెప్పకుండా హఠాత్తుగా బయల్దేరాడని
డి.పైవన్నియు
10.ఈ పద్యం భావమేమిటి?
‘కరిఁ దిగుచు మకరి సరసికిఁ గరి దరికిని మకరిఁ గరకరి బెరయన్
గరికి మకరి మకరికిఁ గరి భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్’
ఎ.గజేంద్రుణ్ణి మొసలి నదిలోకి లాగింది, ఏనుగు కంటె మొసలి బలమైనది
బి.ఆ మొసలిని గజరాజు గట్టుపైకి ఈడ్చింది, మొసలి కంటె ఏనుగు బలమైంది
సి.అని అతల కుతల లోకాల వీరులు, తోటి ఏనుగులు, మొసళ్లు ఉత్కంఠగా చూస్తున్నప్పుడు
డి.పైవన్నియు
*
గత వారం క్విజ్ సమాధానాలు
1.బి 2.సి 3.బి 4.ఎ 5.ఎ 6.ఎ 7.సి 8.డి 9.ఎ 10.డి

-సునీల్ ధవళ 97417 47700