క్విజ్

‘బ్రహ్మ సమాజ్’ రూపశిల్పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.రాజా రామ్‌మోహన్ రాయ్ ప్రారంభించిన వార్తా పత్రిక ఏది?
ఎ.ఆవాజ్ బి.ఆనంద్ బజార్ పత్రిక
సి.సంబద్ కౌముది డి.కలకత్తా టైమ్స్

2.రాజా రామ్‌మోహన్ రాయ్‌లోని ఏ పదం ఒక మొఘల్ చక్రవర్తి బిరుదుగా ఇచ్చేరు?
ఎ.రాజా బి.రామ్
సి.రాయ్ డి.పైవేవీ కావు

3.దిగువ వాటిలో రాజా రామ్‌మోహన్ రాయ్ స్థాపించినవేవి?
ఎ.ఆత్మీయ సభ బి.బ్రహ్మ సభ
సి.బ్రహ్మ సమాజ్ డ.పైవన్నియు

4.రాజా రామ్‌మోహన్ రాయ్ ఏ రాష్ట్రంలో జన్మించారు?
ఎ.బీహార్ బి.ఉత్తరప్రదేశ్
సి.బెంగాల్ డి.మధ్యప్రదేశ్

5.రాజా రామ్‌మోహన్ రాయ్ ప్రారంభించిన విద్యా సంస్థ పేరు ఏది?
ఎ.జోద్‌పూర్ యూనివర్సిటీ, బెంగాల్
బి.హిందూ కాలేజ్, కలకత్తా
సి.హిందూ కాలేజ్, ఢిల్లీ
డి.బెనారస్ యూనివర్సిటీ, వారణాసి

6.రాజా రామ్‌మోహన్ రాయ్ కింది వాటిలో దేని కోసం పాటుపడ్డారు?
ఎ.వితంతు వివాహాల అమలు, స్ర్తి స్వేచ్ఛ, సమానత్వం
బి.బాల్య వివాహాల నిషేధం
సి.పరదా విధానం నిషేధం డి.పైవన్నియు

7.రాజా రామ్‌మోహన్ రాయ్ పోరాడిన ప్రధాన సాంఘిక దురాచారమేది?
ఎ.భ్రూణ హత్యలు బి.సతి
సి.వరకట్నం డి.పైవన్నియు
8.రాజా రామ్‌మోహన్ రాయ్ ఖననం జరిగిన ప్రదేశం లేదా విశ్రాంతి స్థలం ఎక్కడ ఉంది?
ఎ.బ్రిస్టల్, ఇంగ్లండ్ బి.సాల్ట్ లేక్ సిటీ, కలకత్తా
సి.రాజా రాయ్ ఘాట్, వారణాసి
డి.్ఢకా, బంగ్లాదేశ్

9.రాజా రామ్‌మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు?
ఎ.1828 బి.1869
సి.1928 డి.1938

10.రామ్ మోహన్ రాయ్ యొక్క పోరాటం చూసి అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ ఏ చట్టం చేయించాడు?
ఎ.సతీ సహగమనం అమానుషమైన చర్య కాబట్టి పాటించకూడదు
బి.సతి అన్యాయం, హేయమైన చర్య కాబట్టి నిషేధించబడింది
సి.సతిని ప్రోత్సహించి అమలుపర్చే వాళ్లు నేరస్థులు, కఠిన కారాగార శిక్షార్హులు
డి.పైవన్నియు
*
గత వారం క్విజ్ సమాధానాలు
1.సి 2.సి 3.డి 4.ఎ 5.ఎ 6.సి 7.బి 8.ఎ 9.డి 10.ఎ

-సునీల్ ధవళ 97417 47700