క్విజ్

అపర అన్నపూర్ణ.. సీతమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమే ధ్యేయంగా ‘అతిథి దేవోభవ’ అన్న పదానికి ఉదాహరణగా నిలిచిన సీతమ్మగారు ఏ పేరుతో పిలువబడుతారు?
ఎ.అపర అన్నపూర్ణ బి.ఆంధ్రుల అన్నపూర్ణ
సి.పేరూరు అన్నపూర్ణ డి. ఎ అండ్ బి

2.అన్నం పరబ్రహ్మ స్వరూపమ్, అన్నదానానికి మించిన దానం లేదని చిన్నప్పటి నుంచి సీతమ్మ గార్కి నేర్పిన తల్లిదండ్రుల పేర్లు ఏమిటి?
ఎ.డొక్కా బువ్వన్న, నరసమ్మ
బి.డొక్కా జోగన్న, సుబ్బమ్మ
సి.అనిపిండి భవాని శంకరం, నరసమ్మ
డి.గంటి భవాని శంకరం, నరసమ్మ

3.డొక్కా సీతమ్మగారు పెరిగిన ఊరు?
ఎ.మండపేట బి.తణుకు
సి.రామచంద్రాపురం డి.కృష్ణలంక

4.డొక్కా సీతమ్మ ఏ అన్నాహుర్తులను ఆదుకుని కడుపునిండా భోజనం పెట్టేవారు?
ఎ.అన్ని కులాల వారిని బి.అన్ని మతాల వారిని
సి.అన్ని జాతులు, పేద, బీద, గొప్ప, స్ర్తి పురుషులకు
డి.పైవన్నియు

5.ఏ బ్రిటీష్ చక్రవర్తి/ రాణి సీతమ్మగారి ఉదారత, త్యాగం తెలుసుకొని సన్మానించడానికి సన్నద్ధమయ్యేరు?
ఎ.కింగ్ ఎడ్వర్డ్ తినిని బి.కింగ్ ఎడ్వర్డ్ నిని
సి.కింగ్ జార్జ్ డి.క్వీన్ విక్టోరియా

6.ఏ ఊరిలో డొక్కా సీతమ్మగారు వచ్చిన వారికి లేదనకుండా తుదిశ్వాస విడిచేవరకు వండి వార్చి వడ్డించేరు?
ఎ.లంకల గన్నవరం బి.కొత్తపల్లి
సి.వేమవరం డి.పాలగుమ్మి
7.డొక్కా సీతమ్మగారి 9 ఏళ్ల వయసులో వివాహం చేసుకొని ఆవిడని నిరతాన్నదానం చేసే లా ప్రోత్సహించిన ఆమె భర్త ఎవరు?
ఎ.డొక్కా బువ్వన్న
బి.డొక్కా బసవన్న
సి.డొక్కా జోగన్న
డి.డొక్కా జగ్గన్న

8.ఎంతోమందికి నిత్యాన్న దానం చేసి కీర్తి పొందిన డొక్కా సీతమ్మ గారు గురించి క్రింది వానిలో ఏది సరియైనది?
ఎ.అతిథులు ఆకలితో ఏ వేళల్లో వచ్చినా అందరి ఆకలి తీర్చడం కోసం ఒక గది నిండా కుండలలో చద్దన్నం వండి ఉంచేవారు
బి.ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా చేతికి ఎముక లేకుండా విరాళాలు ఇచ్చి ఆదుకునేవారు
సి.అర్ధరాత్రి ఆకలితో నున్న అతిథులెవరైనా వస్తారేమోనని లాంతరు పట్టుకొని నది ఒడ్డుకు వెళ్లి చూసేక నిద్ర కుపక్రమించేవారు
డి.పైవన్నియు

9.సీతమ్మగారి సేవా తత్పరతకు, నిస్వార్థత, దయను గుర్తింపు గౌరవ సూచకంగా, ఆవిడ ఛాయాచిత్రాన్ని లండన్‌లో ఎక్కడ ఉద్ఘాటించారు?
ఎ.రాయల్ పేలస్ బి.పార్లమెంట్ హాల్
సి.బిగ్‌బెన్ డి.తుస్సాడ్ వేక్స్ మ్యూజియం

10.ఏ నదిపై కట్టిన ఆక్వాడక్ట్‌కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు?
ఎ.ప్రాణహిత బి.ఇంద్రావతి
సి.వైనతేయ డి.కినె్నరసాని

గత వారం క్విజ్ సమాధానాలు
1.సి 2.ఎ 3.డి 4.సి 5.బి 6.డి 7.బి 8.ఎ 9.ఎ 10.డి

-సునీల్ ధవళ సెల్: 97417 47700