క్విజ్

‘ఆజాద్’ అసలు పేరేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.లాలా లజపతిరాయ్ భారతీయ స్వాతంత్య్ర సమరంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఏ బిరుదుతో పిలువబడేవారు?
ఎ.పంజాబ్ కేసరి బి.ఐరన్ మేన్ ఆఫ్ పంజాబ్
సి.పంజాబ్ టైగర్ డి.గ్రాండ్ ఓల్డ్‌మేన్ ఆఫ్ ఇండియా
2.అల్లూరి సీతారామరాజు, దేశానికి, తెలుగు జాతికి గర్వకారణం. రామరాజు, గంటం దొర, మల్లు దొరలను పట్టుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఎక్కడ నుంచి వందల సైనిక దళాన్ని రప్పించింది?
ఎ.మలబార్ స్పెషల్ పోలీస్, అస్సాం రైఫిల్స్
బి.పంజాబ్ రెజిమెంట్
సి.బర్మా రెజిమెంట్
డి.రాయల్ గూర్ఖా రైఫిల్స్, అస్సాం రైఫిల్స్
3.ఏ ఉద్యమం కోసం లాలా లజపతిరాయ్ పాదయాత్ర చేస్తూండగా బ్రిటీష్ వారు లాఠీచార్జి చేశారు. ఆ గాయాల కారణంగా లాలా లజపతిరాయ్ మరణించారు?
ఎ.సైమన్ కమిషన్ బి.స్వదేశీ ఉద్యమం
సి.క్విట్ ఇండియా ఉద్యమం డి.ఉప్పు సత్యాగ్రహం
4.తాంతియా తోపె గొప్ప స్వాతంత్య్ర సమరయోధులలో ఒకడు. అతని పాత్ర ఏ ఉద్యమంలో ప్రాముఖ్యమైంది?
ఎ.క్విట్ ఇండియా ఉద్యమం
బి.జలియన్ వాలాబాగ్ తిరుగుబాటు
సి.హోం రూల్ మూవ్‌మెంట్
డి.1857 నాటి సిపాయిల తిరుగుబాటు
5.తాంతియా తోపె అసలు పేరేమిటి?
ఎ.పాండురంగ విఠల్ బి.రామచంద్ర పాండురంగ
సి.బాజీరావు పాండురంగ డి.మాధవ్‌రావు
6.చంద్రశేఖర్ ఆజాద్ తన పేరులో ‘ఆజాద్’ పదం స్వీయంగా చేర్చుకున్నారు. అతని అసలు పేరు ఏమిటి?
ఎ.చంద్రశేఖర్ శర్మ
బి.చంద్రశేఖర్ బహుగుణ
సి.చంద్రశేఖర్ తివారీ
డి.చంద్రశేఖర్ రాథోడ్
7.ఏ విప్లవ స్వాతంత్య్ర సమరయోధులు హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో భాగంగా ఉండి స్వాతంత్య్ర పోరాటం జరిపేవారు?
ఎ.జోగేష్ ఛటర్జీ
బి.చంద్రశేఖర్ ఆజాద్ మరియు రాంప్రసాద్ బిస్మిల్
సి.యోగేంద్ర శుక్లా మరియు సచ్చీంద్ర సన్యాల్
డి.పైన పేర్కొన్న వారందరూ
8.ఏ విప్లవ స్వాతంత్య్ర సమరయోధులు హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో భాగంగా ఉండి స్వాతంత్య్ర పోరాటం జరిపేవారు?
ఎ.చంద్రశేఖర్ ఆజాద్
బి.్భగవతి చరణ్ వోహ్రా
సి.్భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ థాపర్ మరియు శివరాం రాజ్‌గురు
డి.పైన పేర్కొన్న వారందరూ
9.ఏ విప్లవ స్వాతంత్య్ర సమరయోధులు జుగాంతర్ లేదా యుగాంతర్ పోరాట సేనలో ఉండి స్వాతంత్య్ర పోరాటం జరిపేవారు?
ఎ.బరీన్ ఘోష్, బాఘా జతిన్, హేమచంద్ర కనుంగో
బి.బాదల్ గుప్త, సూర్య సేన్, ప్రఫుల్ల చాకి
సి.ఖుదిరామ్ బోస్, దినేష్ గుప్తా, రాజు సుబోధ్ మాలిక్
డి.పైన పేర్కొన్న వారందరూ
10.బెంగాల్ ప్రెసిడెన్సీలో చిట్టగాంగ్ ఆయుధాల దాడిలో ఏ విప్లవ వీరులు పేర్కొన్నారు?
ఎ.త్రిపురసేన్, బిధు భూషణ్ భట్టాచార్య, గణేష్ ఘోష్, కల్పనా దత్తా, హిమాన్షు సేన్
బి.ప్రీతిలత వడ్డేదార్, మనోరంజన్ భట్టాచార్య, అనంతసింగ్, ఆనంద్ ప్రసాద్ గుప్తా
సి.సూర్యసేన్, లోకనాథ్ బల్, అంబికా చక్రవర్తి, హరిగోపాల్ బల్, ఆనంద్ గుప్తా, బినోద్ బిహారీ చౌదరి
డి.పైన పేర్కన్న వారందరూ

గత వారం క్విజ్ సమాధానాలు:
--------------------------------------
1.బి 2.బి 3.డి 4.డి 5.డి 6.ఎ 7.డి 8.ఎ 9.డి 10.బి

-- సునీల్ ధవళ 97417 47700