క్విజ్

పంజాబ్ కేసరి లజపత్‌రాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రేరణాత్మక నాయకుడైన లాలా లజపతిరాయ్ ఏ బ్యాంక్ స్థాపన చేశారు?

ఎ.అమృత్‌సర్ కోఆపరేటివ్ బ్యాంక్
బి.పంజాబ్ సింధ్ బ్యాంక్
సి.పంజాబ్ నేషనల్ బ్యాంక్
డి.బ్యాంక్ ఆఫ్ పాటియాలా

2.లాలా లజపతిరాయ్ ఒక ప్రముఖ రచయిత కూడా. ఆయన చేసిన రచనలేవి? స్వరాజ్ మరియు సాంఘిక మార్పు, ‘ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా: ఎ హిందూస్ ఇంప్రూషన్స్ అండ్ ఎ స్టడీ’ అతను రాసిన పుస్తకాలు.

ఎ.హిస్టరీ ఆఫ్ ఆర్యసమాజ్
బి.ఇంగ్లండ్స్ డెట్ టు ఇండియా
సి.స్వరాజ్ అండ్ సోషల్ ఛేంజ్
డి.పైవన్నియు

3.పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో, జనవరి 28, 1865న జన్మించిన లాలా లజపతిరాయ్ ‘లా’ చదివి ఏ హైకోర్టు వద్ద ‘లా’ ప్రాక్టీస్ చేసేవారు?

ఎ.బొంబాయి బి.లాహోర్
సి.్ఢల్లీ డి.కరాచి

4.చంద్రశేఖర్ ఆజాద్ మరియు భగత్‌సింగ్ వంటి యువతకు స్ఫూర్తినిచ్చి, తరతరాలకు ప్రేరణ కల్పించిన లాలా లజపతిరాయ్ ఏ ఉద్యమంలో పాల్గొన్నారు?

ఎ.స్వదేశీ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం
బి.హిందూ సంస్కరణ ఉద్యమాలు
సి.ఆర్యసమాజ్ డి.పైవన్నియు

5.మాతృభూమి కోసం తన జీవితాన్ని అర్పించి ప్రాణత్యాగం చేసిన రాయ్ పేరు మీద లాలా లజపతిరాయ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఎక్కడ స్థాపించారు?

ఎ.లూథియానా బి.చండీగఢ్
సి.్ఢల్లీ డి.ముంబై

6.లాలా లజపతిరాయ్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైనె్సస్ ఎక్కడ నెలకొల్పారు?

ఎ.హిసార్, హర్యానా బి.ఆనంద్, గుజరాత్
సి.సోనిపట్, హర్యానా డి.జలంధర్, పంజాబ్

7.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతీ ఉద్యమంలో లాలా లజపతిరాయ్ చురుకుగా పాల్గొన్నారు. ఏ బ్రిటీష్ చట్టానికి ధైర్యంగా వ్యతిరేకంగా పోరాడినప్పుడు, లాలా లజపతిరాయ్‌కి పంజాబ్ కేసరి (పంజాబ్ సింహం) అనే బిరుదిచ్చారు?

ఎ.రౌలట్ చట్టం బి.సైమన్ కమిషన్
సి.ఫ్రేజర్ కమిషన్ డి.సార్జెంట్ ప్లాన్

8.క్షయ వ్యాధితో చనిపోయిన తన తల్లి జ్ఞాపకార్థం లాలా లజపతిరాయ్ ఒక ట్రస్ట్‌ని ప్రారంభించి అతని తల్లి గులాబ్‌దేవి మరణించిన ప్రదేశంలో మహిళలకు క్షయవ్యాధి ఆసుపత్రి నిర్మించారు. గులాబ్ దేవి మెమోరియల్ చెస్ట్ ఆసుపత్రి ఎక్కడ ఉంది?

ఎ.గుర్గాన్, హర్యానా బి.హోషియార్‌పూర్, పంజాబ్
సి.లాహోర్, పాకిస్తాన్ డి.రావల్పిండి, పాకిస్తాన్

9.ఏ ఉద్యమం కోసం లాలా లజపతిరాయ్, శాంతంగా పాదయాత్ర చేస్తూండగా బ్రిటీష్ వారు లాఠీఛార్జ్ జరిపారు. ఆ గాయాల కారణంగా 17 నవంబర్ 1928న లాలా లజపతిరాయ్ మరణించారు?

ఎ.సైమన్ కమిషన్ బి.స్వదేశీ ఉద్యమం
సి.క్విట్ ఇండియా ఉద్యమం డి.ఉప్పు సత్యాగ్రహం

10.విప్లవ స్వాతంత్య్ర సమరయోధుల త్రయం ‘లాల్ - బాల్ - పాల్’గా ఎవరు సూచించబడ్డారు?

ఎ.కుబేర్‌నాథ్ రాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్
బి.లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు దేబి ప్రసాద్ పాల్
సి.రాజా రామ్‌మోహన్ రాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు క్రిస్టో దాస్‌పాల్
డి.లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్ మరియు బిపిన్ చంద్రపాల్
================================================================
గత వారం క్విజ్ సమాధానాలు

1.ఎ 2.బి 3.బి 4.సి 5.బి 6.డి 7.ఎ 8.సి 9.బి 10.బి 11.బి

-సునీల్ ధవళ 97417 47700