క్విజ్

మేటి తత్త్వవేత్త అరబిందో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.అరబిందో ఘోష్ ఆగస్టు 15, 1872న కలకత్తాలో జన్మించారు. శ్రీ అరబిందో గూర్చి ఏది సరియైనది?

ఎ.జాతీయవాది, విప్లవకారుడు మరియు స్వాతంత్య్ర సమరయోధుడు
బి.కవి, సాహిత్యకారుడు మరియు పండితుడు
సి.యోగి, ఆధ్యాత్మికవేత్త మరియు తత్త్వవేత్త
డి.పైవన్నియు

2.డిసెంబర్ 5, 1950న అరబిందో ఘోష్ తనువు చాలించారు. అరబిందో ఏయే భాషల్లో ప్రావీణ్యం ఉండి నిష్ణాత పండితుడుగా కొనియాడబడ్డాడు?

ఎ.ఆంగ్లం, బెంగాలీ, హిందీ, సంస్కృతం
బి.గ్రీకు, ఇటాలియన్
సి.లాటిన్, ఫ్రెంచ్, జర్మన్
డి.పైవన్నియు

3.శ్రీ అరబిందో విద్యాభ్యాసం, చదివిన విద్యాలయం గూర్చి ఏది సరియైనది?

ఎ.లొరెటో కానె్వంట్, డార్జిలింగ్‌లో ప్రాథమిక విద్య
బి.సెయింట్ పాల్స్, ఇంగ్లండ్‌లో ఉన్నత విద్య
సి.కేంబ్రిడ్జ్, గ్రేట్ బ్రిటన్‌లో భారతీయ సివిల్ సర్వీస్ పరీక్ష
డి.పైవన్నియు

4.చదువు పూర్తి చేసుకున్నాక శ్రీ అరబిందో ఘోష్ ఏ వృత్తిలో చేరారు?

ఎ.కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా
బి.కేసరి పత్రిక సంపాదకునిగా
సి.బరోడా స్టేట్ కళాశాల ఫ్రెంచ్ ఉపాధ్యాయునిగా, ఉప కులపతి మరియు బరోడా మహారాజు సహాయకునిగా
డి.కలకత్తా నగర కలెక్టర్‌గా

5.1908 నుండి భారత స్వాతంత్య్ర పోరాటంలో అరబిందో ఘోష్ కీలక పాత్ర పోషించారు.

ఎ.బెంగాల్ విభజన నేపథ్యంలో విప్లవాత్మక ఉద్యమం జరపడంలో ముందంజ వేశారు
బి.సహాయ నిరాకరణోద్యమం
సి.బ్రిటీష్ వస్తువుల బహిష్కరణకు పిలుపునిచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు
డి.పైవన్నియు

6.శ్రీ అరబిందో ఘోష్ మెడకు అలీపూర్ బాంబ్ ఘటన ఉచ్చుగా తగిలి జీవితంలో మలుపు తెచ్చింది. కారాగారంలో గడిపాక సుదీర్ఘ విచారణ అనంతరం నిర్దోషిగా విడుదలయ్యారు. అరబిందో తరఫున వాదించి అతని విడుదలకు కృషి చేసిన వ్యక్తి ఎవరు?

ఎ.గోపాలకృష్ణ గోఖలే బి.బాలగంగాధర్ తిలక్
సి.చిత్తరంజన్‌దాస్ డి.బిపిన్ చంద్రపాల్

7.జైలులో ఉన్న సమయంలో, అరబిందో ఘోష్, యోగా మరియు ధ్యానంలో ఆసక్తిని పెంచుకున్నారు. ప్రాణాయామ మరియు ధ్యానం సాధన ప్రారంభించాడు. శ్రీ అరబిందో ఘోష్ 1910లో కలకత్తా నుండి ఎక్కడికి వలస వెళ్లారు?

ఎ. ఢిల్లీ బి.పూణె
సి.వారణాసి డి.పుదుచ్చేరి

8.శ్రీ అరబిందో ఆశ్రమం తొలిసారిగా ఎప్పుడు, ఎక్కడ స్థాపించబడింది?

ఎ.1945 కలకత్తా బి.1937 ఢిల్లీ
సి.1926 పుదుచ్చేరి డి.1921 డార్జిలింగ్

9.అరబిందో ఘోష్ చేసిన రచనలలో అత్యంత ముఖ్యమైనవేవి?

ఎ.ఎస్సేస్ ఆన్ ద గీత, ది సీక్రెట్ ఆఫ్ ది వేద
బి.హైమ్స్ టు ది మిస్టిక్ ఫైర్, ది హ్యూమన్ సైకిల్
సి.్ఫండేషన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్
డి.పైవన్నియు

10.1901 దేశంలో మొట్టమొదటి యూత్ క్లబ్‌ని ఏ పేరు మీద అరబిందో స్థాపించారు?

ఎ.్భరత్ ఫ్రెండ్స్ క్లబ్
బి.బరోడా జింఖానా క్లబ్
సి.కలకత్తా యూత్ క్లబ్
డి.అనుశీలన్ సమితి
================================================================
గత వారం క్విజ్ సమాధానాలు
1.బి 2.బి 3.సి 4.డి 5.డి 6.సి 7.డి 8.డి 9.ఎ 10.బి

-సునీల్ ధవళ 97417 47700