ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. పక్కనున్న వర్కింగ్ స్టిల్ ఏ సినిమాది?
2. ఎన్టీఆర్ భలేతమ్ముడు, ఆరాధన చిత్రాల్లో కామన్ గాయకుడిని పట్టుకోండి?
3. ఛత్రపతి, రాఘవేంద్ర చిత్రాల హీరో?
4. న్యాయం కావాలి, ఇది పెళ్లంటారా? చిత్రాల కథానాయిక ఎవరో?
5. చారూ చారూ నా బంగారు చారూ..., ఏమిటీ అవతారం.. ఎందుకు.. ఈ పాటల హాస్యజంట గుర్తుందా?
6. -అమ్మమ్మో/ ఏమిటిది? అబ్బబ్బో...
-ఓసే వయ్యారి రంగీ/ వగలమారి బుంగీ పాటల్లో -ఓ ఆభరణాన్ని పసిగట్టండి?
7. దూరమెంత మిగిలున్నా/ దిగులు పడకు నేస్తమా... చమట నీరు చిందగా/ నుదుటి రాతమార్చుకో.. చరణాలకు పల్లవి?
8. ఒకరు వేలు. మరొకరు వీరభద్రరావు. దేంతో హ్యాస్యాన్ని పగలకొట్టేశారు?
9. -నిన్ను చూడగానే చిట్టిగుండె కొట్టుకుంటదే.. -అందమైన భామలు/ లేతమెరుపు తీగలు.. -సంగీత దర్శకుడు?
10. ఈ ఫొటో చూస్తే అక్కినేని నటించిన ఏ చిత్రం గుర్తుకొస్తుంది?

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: బి రాజేశ్వరరావు