అంతర్జాతీయం

ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 2: తన నాయకత్వం విషయంలోనూ, బ్రెగ్జిట్‌కు సంబంధించి అనుసరిస్తున్న వ్యూహం విషయంలోనూ పార్టీనుంచి విపరీతమైన వత్తిళ్లు వస్తున్నా తాను నిలకడగా ఉంటున్నానని, ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికే కట్టుబడి ఉన్నానని బ్రిటీష్ ప్రధాని ధెరిసా మే స్పష్టం చేశారు. చైనాలో మూడురోజుల పర్యటనను ముగించుకున్న అనంతరం బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన థెరిసా, భవిష్యత్‌లో ఐరోపా యూనియన్‌తో జరిపే చర్చల్లో ఏరకమైన ఫలితాలను తాను ఆశిస్తున్నదీ వెల్లడించడానికి నిరాకరించారు. ఏప్రిల్‌లో మొదలుకానున్న ఈ చర్చలు బ్రెగ్జిట్‌కు సంబంధించినంత వరకు అత్యంత కీలకమైనవన్న విషయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే, వాణిజ్యానికి సంబంధించి పరిమితస్థాయిలో నష్టానికి పరిమితమయ్యే ఒప్పందానికి అంగీకరిస్తారా? లేక బ్రిటన్ సొంతంగానే తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ‘ఏవీ కూడా మాముందున్న అంశాలు కాదు. ఐరోపా యూనియన్‌తో ఉభయతారకమైన రీతిలోనే వాణిజ్య చర్చలు జరపాలన్నదే మా ఆశయం’ అని స్పష్టం చేశారు. థెరిసా నాయకత్వం విషయంలో అధికార కన్జర్వేటివ్ పార్టీలో తీవ్రస్థాయి అసంతృప్తి నెలకొందని, ముఖ్యంగా బ్రెగ్జిట్‌కు సంబంధించి ఆమె నిర్ణయాలను అధికార పార్టీ ప్రతినిధి వ్యతిరేకిస్తున్నారంటూ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. బ్రెగ్జిట్‌కు సంబంధించి బ్రిటన్ వైఖరి చాలా స్పష్టంగా, నిర్ధుష్టంగా థెరిసా వ్యక్తీకరించాలని కన్జర్వేటివ్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలోనే వత్తిడి తేవడం మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే బ్రిటన్‌కు నష్టం కలిగించే వాణిజ్య ఒప్పందంపట్లే థెరిసా మొగ్గుచూపుతున్నారన్న విమర్శలూ తలెత్తాయి. అయితే ఈ విమర్శల మాటెలావున్నా బ్రిటన్ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పరిరక్షించే విధంగానే తాను వ్యవహరిస్తానని థెరిసా స్పష్టం చేశారు. తమ చట్టాలను, తమ సంపదను, తమ సరిహద్దులను కాపాడాలన్న బాధ్యతతోనే బ్రిటన్ ప్రజలు తమకు అధికారాన్ని అప్పగించారని, వారి ఆశయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నానని థెరిసా వెల్లడించారు. అలాగే ఇతర దేశాలతో కూడా స్వేచ్ఛాయత వాణిజ్యానికే తాము ప్రాధాన్యత ఇస్తామని, అయితే ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభదశలోనే ఉన్నాయన్నారు. వీటి అనంతరం పార్లమెంట్‌లో బిల్లు పెడతామని, అర్థవంతమైన రీతిలోనే ఐరోపా యూనియన్‌తోనూ ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. ఒక్క బ్రెగ్జిట్ విషయంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా బ్రిటన్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామన్నారు. చైనా పర్యటనలో భాగంగా దాదాపు 12.7బిలియన్ డాలర్లమేర ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్న థెరిసా, అంతర్జాతీయంగా కూడా బ్రిటన్ ప్రాబల్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తామన్నారు.