బాలీవుడ్‌పై మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో బ్యూటీగాళ్‌గా యమ క్రేజ్‌ని సంపాదించుకున్న రకుల్ ప్రీత్‌సింగ్ అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టేసింది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా క్రేజీ హీరోలందరితో ఆడిపాడింది. లభించిన చిత్రాల్లో పోషించిన పాత్రల ద్వారా గ్లామర్ చిందించడంలోనూ తను ముందు వరుసలోనే వుంది. చిత్రసీమలో ఏ హీరోయిన్ అయినా అన్ని రకాల పాత్రలు పోషించినప్పుడే కొంత కాలం వెలుగు. ఏదో ఓ తరహా పాత్రలకే పరిమితమైతే ఇక అంతే సంగతులు. పదికాలాల పాటు కెరీర్‌లో నిలదొక్కుకోవాలంటే విభిన్నమైన పాత్రలు పోషించాలి. అయితే రకుల్‌కు టాలీవుడ్‌లో అలాంటి పాత్రలేం రాలేదు. ఈ బ్యూటీని తమ చిత్రాలకు అదనపు ఆకర్షణగానే చూశారు తప్ప, ఆమె పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండానే చేశారు దర్శక, నిర్మాతలు. ఆలస్యంగానైనా ఈ విషయాన్ని రకుల్ గమనించినట్లుంది. అందుకే తన పంథాని మార్చుకుంది. టాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లో నటించాలన్న నిర్ణయానికొచ్చేసింది. అందుకే ఇక బాలీవుడ్‌పై మోజు పెంచుకుంటోంది. అక్కడ అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోందిట. ఈ విషయం గురించి రకుల్‌ని కదిలిస్తే - ‘అవును.. నిజమే! అన్ని భాషల్లో నటించాలనుకుంటున్నా. అయితే నాకు క్రేజీని తెచ్చిపెట్టిన టాలీవుడ్‌ను ఎన్నటికీ వదిలేది లేదు. నటి అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి. అయితే నాకు అలాంటి అవకాశం రాలేదు. గ్లామర్ పాత్రలంటూ అన్నీ మోస పాత్రలే లభిస్తున్నాయి. ఇక ముందు పాత్రల ఎంపికలో కూడా ఆచితూచి అడుగు వేయాలనుకుంటున్నా. బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయి. కథలు వింటున్నా. మంచి క్యారెక్టర్ అనుకుంటే అక్కడ కూడా వెలుగులు విరజిమ్మాలనుంది’ అంటూ చెప్పుకొచ్చింది. వాహ్..రకుల్!