చిత్తూరు

20న వృద్ధులు, దివ్యాంగులకు, 21న చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 19: వృద్ధులు, దివ్యాంగులకు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రతినెలా రెండు సాధారణ దినాల్లో ప్రత్యేక దర్శనం కల్పించే సౌకర్యాన్ని టీటీడీ అమలు చేస్తున్న నేపథ్యంలో ఈనెల 20న వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పించనున్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు 4000 టోకెన్లను జారీ చేయనున్నారు. ఉదయం 11 గంటల స్లాట్‌కు 1000 మంది, మధ్యాహ్నం రెండు గంటల స్లాట్‌కు 2000 టోకెన్లు, మూడు గంటలకు 1000 మందికి టోకెన్లు జారీ చేస్తారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఆలయం లోపలకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. భక్తుల కోరిక మేరకు అదనంగా నెలలో ఎక్కువ మందికి వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. రద్దీరోజుల్లో కూడా వృద్ధులు, దివ్యాంగులు ప్రతిరోజూ రెండు పర్యాయాలు కల్పిస్తున్న సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఐదేళ్లలోపు చంటి పిల్లల తల్లిదండ్రులకు ఈనెల 21న బుధవారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుపధం ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. ఇక సాధారణ రోజుల్లో ఒక ఏడాదిలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపధం ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలున్న తల్లిదండ్రులకు కూడా నెలలో రెండు రోజుల పాటు అదనపు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.