రంగారెడ్డి

వ్యవసాయ చిత్రకళా ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, నవంబర్ 3: వ్యవసాయ చిత్రకళలు భారతీయ సమాజ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిభింభిస్తాయని నార్మ్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్‌రావు అన్నారు. జాతీయ వ్యవసాయ పరిశోధనా యాజమాన్య సంస్థ వ్యవసాయ చిత్ర కళోత్సవాన్ని అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు కృషి కళా ఉత్సవ్‌ను నిర్వహించారు. ముగింపు మహోత్సవాన్ని రాజేంద్రనగర్ సర్కిల్లోని నార్మ్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఖ్యాతి పొందిన జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ముంబాయి మాస్టర్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్న విద్యార్థులు ఈ చిత్ర కళోత్సవంలో పాలుపంచుకున్నారు. బృంద విద్యార్థులు వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన మూలాంశాలతో తమ తమ పెయింటింగ్స్‌లను రూపొందించారని అన్నారు. బృందంలో ఉన్న 23మంది కలిసి 52 పెయింటింగ్‌లను అద్భుతంగా గీశారని పేర్కొన్నారు. వీరికి చిత్రకళా గురువులు, కొలేరి ఫ్యాకల్టీ ప్రొఫెసర్ అనంత నిగమ్, శిల్పానిగమ్, దీపక్ తోడ్పాటునందించాలని మార్గనిర్దేశం కూడా చేశారు. కార్యక్రమంలో నార్మ్ ఫ్యాకల్టీ డాక్టర్ కృష్ణన్, సెంథిల్ వినాయగం, తమ్మిరాజు, నిగమ్‌దేవ్ పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమించిన టిప్పర్లపై కఠిన చర్యలు

గచ్చిబౌలి, నవంబర్ 3: ట్రాఫిక్ పోలీసులు అలస్యంగానైనా కళ్లు తెరిచారు. గత శనివారం గచ్చిబౌలి విప్రో చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందగా అమె భర్త తీవ్రగాయాలైన సంఘటనతో ట్రాఫిక్ పోలీసుల్లో కదలిక వచ్చింది. ప్రమాదాపై డీజీపీ కార్యలయం నుంచి అధికారులను వివరణ కోరడంతో స్పందించిన సైబారాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన టిప్పర్లపై కఠిన చర్యలకు డీసీపీ కొరడా ఝుళిపించారు. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో నిబంధనకు విరుద్ధంగా నడుపుతున్న ఏడు టిప్పర్లను గుర్తించి జరిమాన విధించారు. ర్యాష్ డ్రైవింగ్, సరైన ధృవ పత్రాలు లేకపోవడం, వాహనాలకు ఫిట్నెస్ సర్ట్ఫికెట్స్, రిజిస్ట్రేషన్, పర్మిట్‌లేని వాహనాలను ఆర్‌టీఏ అధికారుల సహయంలో లక్షా ఐదు వేల రూపాయలు జరిమాన విధించినట్లు డీసీపీ వెల్లడించారు. అతి వేగాంగా డ్రైవ్ చేసి ప్రమాదాలు చేసిన డ్రైవర్ల లైసెన్స్ రద్దు చేయిస్తామని హెచ్చరించారు. నిబంధలను అతిక్రమించిన టిప్పర్ యజమానులకు నోటీసులు పంపించినట్లు విజయ కుమార్ తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు డీసీపీ చెప్పారు.