బిజినెస్

12 రేవుల్లో 3 శాతం పెరిగిన సరకు రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలోని 12 ప్రధాన రేవుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) సరకు రవాణా 3.18 శాతం వృద్ధిచెంది 447.05 మిలియన్ టన్నులకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ 12 పోర్టుల్లో గత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్-డిసెంబర్ మధ్య 433.26 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ మధ్య 70.85 మిలియన్ టన్నుల సరకులను రవాణా చేసిన కాండ్లా పోర్టు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 4.26 శాతం వృద్ధితో మొత్తం 73.87 మిలియన్ టన్నుల సరకులను రవాణా చేసి అగ్రస్థానంలో నిలిచినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే పారదీప్ పోర్టు ఈసారి 55.13 మిలియన్ టన్నుల సరకు రవాణాతో ద్వితీయ స్థానంలో నిలిచింది. పోయనసారి ఇదే కాలంలో ఈ పోర్టు నుంచి 52.39 మిలియన్ టన్నుల సరకులు రవాణా అయ్యాయి. ఇక ముంబయిలోని జెఎన్‌పిటి నుంచి 48.23 మిలియన్ టన్నులు, ముంబయి పోర్టు నుంచి 46.39 మిలియన్ టన్నుల చొప్పున సరకుల రవాణా జరగ్గా, ఆ తర్వాతి స్థానాల్లో విశాఖపట్నం పోర్టు (42.24 మిలియన్ టన్నులు), చెన్నై పోర్టు (37.41 మిలియన్ టన్నులు), కోల్‌కతా పోర్టు (37.30 మిలియన్ టన్నులు), న్యూ మంగళూరు పోర్టు (25.29 మిలియన్ టన్నులు), విఓ చిదంబరనార్ పోర్టు (27.80 మిలియన్ టన్నులు), కామరాజార్ (ఎన్నూర్) పోర్టు (22.96 మిలియన్ టన్నులు), కొచ్చిన పోర్టు (16.49 మిలియన్ టన్నులు), మర్ముగోవా పోర్టు (13.89 మిలియన్ టన్నులు) నిలిచాయి. అయితే సరకు రవాణా పెరుగుదల పరంగా మర్ముగోవా పోర్టు 35.31 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలువగా, విఓ చిదంబరనార్ పోర్టు 19.30 శాతం వృద్ధితో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది.