రంగారెడ్డి

రిజర్వు ఫారెస్ట్ చట్టాలతో ఇబ్బందులు రాకుండా కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జనవరి 23: వేలాది సంవత్సరాల చరిత్ర కలిగి, స్వయంభుగా వెలసిన అనంతగిరి శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయానికి రిజర్వు ఫారెస్ట్ కారణంగా ఇబ్బందులు తలెత్తడం ఆందోళన కలిగిస్తోందని, ఆ ఇబ్బందుల నుండి ఆలయానికి మినహాయింపు ఇచ్చేలా కేంద్ర అటవీశాఖ, ప్రభుత్వంతో సంప్రదించేందుకు ప్రయత్నిస్తామని ఎంపి రాపోల్ ఆనంద్‌భాస్కర్ వెల్లడించారు. శనివారం అనంతగిరి శ్రీ అనంతపద్మనాభస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయాలు చాలా అరుదని, అనంతగిరి మార్కెండేయ తపోభూమి అని గుర్తుచేశారు. అంతే కాకుండా అనంతగిరి కొండలు ఆరోగ్యకరమైన వాతావారణానికి నెలవని ఖ్యాతి గడించిందని, క్షయవ్యాధి నివారణకు టిబి శానిటోరియం ఏర్పాటైందని చెప్పారు. ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని, పెరిగిపోతున్న ఉదర సంబంధ, మానసిక సంబంధ వ్యాధుల నివారణకు ఆసుపత్రి క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ శాఖపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. వికారాబాద్ ప్రాంత ప్రజలకు అవసరం మేరకు మంజీరా నీటి సరఫరాను పెంచాలని నీటి సరఫరా విభాగానికి లేఖ రాస్తామని, వికారాబాద్ పట్టణ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని రోడ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అర్‌అండ్‌బికి లేఖ రాస్తామని అన్నారు. సమావేశంలో వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ వి.సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మహ్మద్ హఫీజ్, మాజీ ఎంపిటిసి కె.సంగమేశ్వర్, యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కోలుకుంద సంతోష్‌కుమార్‌లు పాల్గొన్నారు.