రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారుపాళ్యం, జనవరి 24: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక వాహనంలో బయలుదేరిన భక్త బృందం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూరు తాలూకా ఎంబి అగ్రహారం నుంచి శనివారం రాత్రి 11 గంటలకు శ్రీవారిని దర్శించుకునేందుకు ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. వీరు వేలూరు మీదుగా వచ్చారు. చిత్తూరు సమీపంలోని బైపాస్ రోడ్డులో వెళ్లాల్సిన ఇన్నోవా వాహనం దారితప్పి బెంగళూరు-చెన్నై జాతీయ రహదారి మీదుగా పలమనేరు వైపు వెళ్లారు. అక్కడ దారి తప్పినట్లు తెలుసుకుని స్థానికులను అడిగి పలమనేరు నుంచి తిరుమల బయలుదేరారు. మార్గమధ్యలో మొగిలి ఘాట్ తొలి మలుపు వద్ద ఇన్నోవా అదుపు తప్పి బోల్తాపడింది.