క్రీడాభూమి

రోహిత్‌కు ఐదో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 24: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన వనే్డ ఇంటర్నేషనల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు రోహిత్ శర్మకు ఐదో స్థానం దక్కింది. అతనికి కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-4 తేడాతో కోల్పోయినప్పటికీ, అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ ఏకంగా ఐదు స్థానాలు మెరుగు పరచుకోవడం గమనార్హం. ఈ జాబితాలో భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉండగా, శిఖర్ ధావన్ ఏడో స్థానాన్ని ఆక్రమించాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఎబి డివిలియర్స్ 900 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భారతీయులు ఎవరూ లేకపోవడం గమనార్హం. ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాకు ఎనిమిదో స్థానం దక్కింది. ఈ జాబితాలో షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మహమ్మద్ హఫీజ్ (పాకిస్తాన్), తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) మొదటి మూడు స్థానాలను సంపాదించారు.