జాతీయ వార్తలు

రజనీ, రామోజీలకు పద్మవిభూషణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

112 మందికి పద్మ అవార్డులు 10మంది ప్రముఖులకు పద్మవిభూషణ్
19మందికి పద్మభూషణ్ 83మంది ప్రముఖులకు పద్మశ్రీ
తెలుగు రాష్ట్రాలకు 12 పద్మలు యార్లగడ్డ, సైనా, సానియాలకు పద్మభూషణ్ కర్నాటక నుంచి దర్శకుడు రాజవౌళికి పద్మశ్రీ

విధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కేంద్రం సోమవారం పద్మ అవార్డులు ప్రకటించింది. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, దివంగత పారిశ్రామికవేత్త ధీరుభాయి అంబానీ, సినీ ప్రముఖుడు రజనీకాంత్, పత్రికాధిపతి సిహెచ్ రామోజీరావు, క్రీడల్లో రాణిస్తున్న సైనా నెహ్వాల్, సానియా మీర్జా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డాక్టర్ నాగేశ్వరరెడ్డి, కె లక్ష్మాగౌడ్, రాజవౌళి, అజయ్ దేవగన్, ప్రియాంకా చోప్రా సహా మొత్తం 112 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. వీటిలో 10 మంది ప్రముఖులకు పద్మవిభూషణ్, 19మందికి పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. 83మంది ప్రముఖులకు పద్మశ్రీ ప్రకటించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు 13 పద్మ అవార్డులు లభించాయి. ఆంధ్రనుంచి రామోజీరావుకు పద్మవిభూషణ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అల్లా వెంకటరావుకు పద్మభూషణ్, ఆల్ల గోపాలకృష్ణ గోఖలే, యాళ్లగడ్డ నాయుడమ్మ, సునీతా కృష్ణన్‌లకు పద్మశ్రీలు దక్కాయి. తెలంగాణ నుంచి సైనా నెహ్వాల్, సానియా మీర్జా, జి నాగేశ్వర్ రెడ్డిలకు పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. లక్ష్మాగౌడ్, మన్నం గోపిచంద్, టివి నారాయణకు పద్మశ్రీలు దక్కాయి. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాకు ప్రపంచస్థాయిలో కీర్తితెచ్చిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళికి కర్నాటక నుంచి పద్మశ్రీ అవార్డు లభించింది.

న్యూఢిల్లీ, జనవరి 25: విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు కేంద్రం సోమవారం పద్మ అవార్డులు ప్రకటించింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, పారిశ్రామికవేత్త ధీరుభాయి అంబానీ (మరణానంతరం), సినీ ప్రముఖుడు రజనీకాంత్, పత్రికాధిపతి సిహెచ్ రామోజీరావు, క్రీడల్లో రాణిస్తున్న సైనా నెహ్వాల్, సానియా మిర్జా, డాక్టర్ నాగేశ్వరరెడ్డి, కె లక్ష్మాగౌడ్, రాజవౌళి, అజయ్ దేవగన్, ప్రియాంకా చోప్రాతోపాటు మొత్తం 112 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. 10మంది ప్రముఖులకు పద్మవిభూషణ్ అవార్డులు, 19మందికి పద్మభూషణ్ అవార్డులు లభించగా, 83మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు 12 పద్మ అవార్డులు లభించటం గమనార్హం. ఆంధ్రకు పద్మవిభూషణ్, 2 పద్మభూషణ్, మూడు పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణకు పద్మభూషణ్, మూడు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఈనాడు పత్రికాధినేత రామోజీరావుకు పద్మవిభూషణ్ లభించింది. ఆంధ్రకు చెందిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అల్లా వెంకట రామారావు, తెలంగాణకు చెందిన ప్రొఫెసర్ డి నాగేశ్వరరెడ్డి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాలకు పద్మభూషణ్ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కె లక్ష్మాగౌడ్, ప్రముఖ వైద్యుడు మన్నం గోపిచంద్, సామాజిక సేవకుడు డాక్టర్ టివి నారాయణ, ఆంధ్రకు చెందిన సర్జన్ అల్లా గోపాలకృష్ణ గోఖలే, సర్జన్ యార్లగడ్డ నాయుడమ్మ, సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్‌కు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఇదిలావుంటే బాహుబలి చిత్రంతో తెలుగు సినిమాకు ప్రపంచస్థాయిలో కీర్తితెచ్చిన దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళికి కర్నాటక నుంచి పద్మశ్రీ అవార్డు లభించటం చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఐర్లాండ్, యుకె, ఫ్రాన్స్, చైనా, సెర్బియా, అరబ్ ఎమిరేట్స్ దేశాలకు చెందిన వారికీ పద్మ అవార్డులు లభించటం గమనార్హం.
పద్మవిభూషణ్ గ్రహీతలు
యామినీ కృష్ణమూర్తి (కళలు), రజనీకాంత్ (సినిమా), గిరిజాదేవి, రామోజీరావు, విశ్వనాథన్ సాంతా, రవిశంకర్, జగ్‌మోహన్, వాసుదేవన్ కలకుంటే, అవినాష్ దీక్షిత్ (అమెరికా), ధీరుభాయి అంబానీ (మరణాంతరం).
పద్మభూషణ్ గ్రహీతలు
అనుపమ్ ఖేర్, ఉదిత్ నారాయణ్, రాకు సుతార్, వినోద్‌రాయ్, హెచ్ కనే్హలాల్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రొఫెసర్ ఎన్‌ఎస్ రామానుజ తాతాచార్య, బర్జీందర్ సింగ్ హుద్దుర్, ప్రొఫెసర్ నాగేశ్వర్‌రెడ్డి, స్వామి తేజోమయానంద, అఫీజ్ కాంట్రాక్టర్, రవీంద్ర చంద్రభార్గవ్, ఆళ్ల వెంకటరామారావు, సైనా నెహ్వాల్, సానియామీర్జా, హిందు జైన్, స్వామి దయానంద, రాబర్ట్ బ్లాక్ విల్ (అమెరికా), పల్లోంజి షాపూర్‌జీ, మిస్ర్తీ (ఐర్లాండ్).
పద్మశ్రీ గ్రహీతలు
ప్రతిభా ప్రహ్లాడ్, బికుందన్ గద్వి, శ్రీదాస్ చంద్ర సుప్కార్, అజయ్ దేవగన్, ప్రియాంకా చోప్రా, తులసీదాస్ భోర్కర్, సోమా గోష్, నీలా మత్‌హాబ్ పాండా, ఎస్‌ఎస్ రాజవౌళి, మాధుర్ భండార్కర్, ప్రొఫెసర్ ఎం వెంకటేశ్‌కుమార్, గులాబీ సపేరా, మమతా చంద్రాకర్, మాళిని అవస్తీ, జయప్రకాశ్ లేకివాల్, కె లక్ష్మాగౌడ్, బాలచంద్ర దత్తాత్రేయ మూందే, నరేష్ చందర్‌లాల్, బీరేంద్రనాథ్ బేజ్‌బరువా, ప్రహ్లాద్ చంద్ర తాసా, డాక్టర్ రవీంద్రనాగర్, డాక్టర్ దయాభాయ్ శాస్ర్తీ, సాంతేశ్వర బైరప్ప, హల్దార్ నాగ్, కామేశ్వరం బ్రహ్మ, పుష్పేష్ పంత్, జోహర్‌లాల్ కౌల్, అశోక్ మాలిక్, మన్నం గోపీచంద్, ప్రొఫెసర్ రవికాంత్, రాంహర్షసింగ్, ప్రొఫెసర్ శివ నరేన్ కురేల్, డాక్టర్ సాధ్యాసచి సర్కార్, ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, ప్రొఫెసర్ టికె లాహిరీ, డాక్టర్ ప్రవీణ్‌చంద్ర, డాక్టర్ దల్జీత్ సింగ్ గంభీర్, డాక్టర్ చంద్రశేఖర్ శేషాద్రి తొగులువా, డాక్టర్ అనీల్‌కుమారి మల్హోత్రా, ఎంవి పద్మ శ్రీవాత్సవ, సుధీర్ వి షా, ఎంఎం జోషి, డాక్టర్ జాన్ ఎవెంజర్, డాక్టర్ నాయుడమ్మ యార్లగడ్డ, సిమోన్ ఒరియన్, ఇంత్యాజ్ ఖురేషీ, పియూష్ పాండే, శుభాష్ పాలేకర్, రవీంద్రకుమార్ సిన్హా, డాక్టర్ హెచ్‌ఆర్ నాగేంద్ర, ఎంసి మెహతా, ఎంఎన్ కృష్ణమణి, ఉజ్వల్ నిక్కం, తొకేహో సీమా, సతీష్‌కుమార్, మైలాస్వామి అన్నాదురై, దీపాంకర్ చటర్జీ, డాక్టర్ గణపతి బడేసాహెబ్ యాదవ్, వీణా టాండన్, ఓంకార్ నాథ్ శ్రీవాత్సవ, సునీతా కృష్ణన్, అజయ్ కుమార్ దుత్తా, ఎం పండిత్ దాసా, పిపి గోపీనాథన్ నయ్యర్, మలెదినీ హెర్మన్ బ్లిక్, శ్రీనివాసన్ దమాల్ కందాలియా, సుధాకర్ వోల్వే, టివి నారాయణ, అరుణాచలం మురుగనాథం, దీపికా కుమారి, సుశీల్ దోశి, మహేశ్ శర్మ, సౌరవ్ శ్రీవాత్సవ, దిలీప్ సంఘ్వి, డాక్టర్ కెకి హర్‌ముస్జి గర్దా, ప్రకాశ్‌చంద్ ఖురానా, సరుూద్ జాఫ్రి, మైకేల్ పోస్టల్, సల్మాన్ అమీన్ సాల్ ఖాన్, హులాన్ జంగ్, ప్రెద్రాగ్ కె నికీ, డాక్టర్ సుందర్ ఆదిత్య మీనన్, అజయ్‌పాల్ సింగ్ భంగా.