Others

రామాయణం పరీక్షలో ముస్లిం బాలిక టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మతపరమైన అసహనం దేశవ్యాప్తంగా అశాంతిని రగిలిస్తుండగా, తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ ముస్లిం బాలిక- ‘ఉన్నత విలువలు నేర్పే ఏ మతగ్రంథమైనా మంచి ఆలోచనలు కలిగిస్తుంద’ని చెబుతోంది. హిందువులు పరమ పవిత్రంగా భావించే ‘రామాయణం’పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి పరీక్షలో మంగళూరు జిల్లా పుత్తూరు తాలూకాకు చెందిన ఫాతిమా రహీలా 93 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది. ‘్భరత సంస్కృతి ప్రతిష్ఠాన్’ ఈ పరీక్షను ఇటీవల నిర్వహించింది. సులియపడవు గ్రామంలోని సర్వోదయ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఫాతిమా తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో రామాయణం పరీక్షకు హాజరైంది. ఆమె తండ్రి ఇబ్రహీం ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తుండగా, అంతంత మాత్రంగా చదువుకున్న తల్లి ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తుంటుంది. ఫాతిమాకు చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం, ఇతర పురాణ గ్రంథాలను చదవడం అంటే ఎంతో ఆసక్తి. మహాభారతంపై వచ్చే ఏడాది జరిగే పరీక్షకు హాజరవుతానని ఆమె చెబుతోంది. అలనాటి సాహిత్యం, ఉన్నత విలువల గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకే రామాయణ, మహాభారతంపై పరీక్షలు నిర్వహిస్తున్నామని, మతపరమైన కోణంలో కాదని ‘్భరత సంస్కృతి ప్రతిష్ఠాన్’ స్థానిక ప్రతినిధులు చెబుతున్నారు. సర్వోదయ హైస్కూల్ నుంచి 8,9 తరగతులకు చెందిన మొత్తం 39 మంది విద్యార్థులు రామాయణం పరీక్షకు హాజరుకాగా, ఫాతిమా అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించింది.