తెలంగాణ

రేపటి నుండి ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 12: మేడారం జాతర సందర్భంగా మేడారంలో 50 ఎకరాల్లో ఆర్టీసి తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వరంగల్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 14 నుండి మేడారంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4వేల ఆర్టీసీ బస్సులను మేడారం జాతరకు ఏర్పాటు చేశామని, మరో 2వేల బస్సులను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. దాదాపు 20లక్షలకు పైగా భక్తులను జాతరకు తరలించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గల 51 ముఖ్య ప్రదేశాల నుండి బస్సులను నడిపిస్తామన్నారు. జాతర సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 12వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నుండి ఎసి బస్సులను కూడా నడుపుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరం మేడారం జాతరకు రూ.21కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చిందని, ఈ ఏడాది జరిగే జాతరకు దాదాపు 30కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ట్రాఫిక్‌జాంను నియంత్రించుటకు సంచార వాహనాలను ఏర్పాటు చేశామన్నారు.