జాతీయ వార్తలు

రెండో విడతగా 23న నేతాజీ ఫైళ్లు బహిర్గతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాల్లో రెండో విడతగా 25 ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే బహిర్గతం చేసే అవకాశం ఉందని సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేశ్ శర్మ తెలిపారు. నేతాజీ మరణం విషయంలో అనేక అనుమానాలు తలెత్తిన దృష్ట్యా ఈ రహస్య ఫైళ్లను నెలకు 25 చొప్పున బహిర్గతం చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు ఇలా బహిర్గతమైన ఫైళ్లను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నామని వెల్లడించారు. నేతాజీ 119వ జయంతి సందర్భంగా గత నెల 23న వందలాది రహస్య ఫైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. రెండో విడత ఫైళ్లను ఈ నెల 23న వెల్లడిస్తామని మంత్రి మహేశ్ శర్మ వెల్లడించారు. అలాగే ఇకనుంచి 23వ తేదీనే ఈ ఫైళ్లను బహిర్గతం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గత నెలలో విడుదల చేసిన ఫైళ్లలో 16,600 పేజీలున్నాయి. అవి బ్రిటిష్ పాలన మొదలుకొని 2007 వరకు నేతాజీ విషయంలో చోటుచేసుకున్న వివరాలన్నింటినీ వెల్లడించాయి.