ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో జైళ్ల ఆధునికీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని జైళ్లను ఆధునికీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జైళ్లను ఆధునిక జైళ్లుగా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలు ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌లోని జైళ్ల శాఖ సిబ్బందికి రెండు రోజుల పునశ్చరణ తరగతులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన పాత జైళ్లను అభివృద్ధి చేస్తామన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఆధునికీకరణకు ఇప్పటికే రూ.20కోట్లు ఖర్చుచేశామని, మరో రూ.10 కోట్లు వ్యయంకాగల పనులు జరుగుతున్నాయన్నారు. వివిధ నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే ఖైదీల్లో పరివర్తన తేవడం ఎంతో కష్టమైన వ్యవహారమని, ఈవిధులను సిబ్బంది అంకితభావంతో చేయాలన్నారు. విధుల్లో రాజీ పడవద్దని, ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రభుత్వ ధ్యేయమే తమ ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జైళ్లశాఖ డిఐజి ఎ చంద్రశేఖర్ మాట్లాడుతూ జైళ్లశాఖలో లోపాలు, సమస్యలను సమీక్షించుకోవడానికి జిల్లా, రాష్టస్థ్రాయిల్లో పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, సెంట్రల్‌జైలు సూపరింటెండెంట్ డాక్టర్ వరప్రసాద్, మహిళాజైలు సూపరింటెండెంట్ శారద తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప స్పష్టంచేశారు. టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసును ప్రస్తావించగా ఎవరు తప్పుచేసినా చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే రాష్ట్రానికి పెట్టుబడులు రావని, దీనివల్ల అభివృద్ధి కుంటుపడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూ రాష్ట్భ్రావృద్ధికి గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తుని విధ్వంసం కేసులను సిఐడికి అప్పగించినట్లు చెప్పారు.