కృష్ణ

అమృత్ పథకం పనుల తీరుపై ఇంజనీరింగ్ చీఫ్ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మార్చి 15: అమృత్ పథకం కింద మంజూరైన పనులను ఇప్పటి వరకు గుత్తేదారులకు అప్పగించకపోవడం పట్ల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పి పాండురంగారావు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఎస్‌సి శ్రీనివాసరావుతో కలిసి పట్టణంలో అమృత్ పథకం కింద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పథకం కింద చేపట్టే రిజర్వాయర్, పైప్‌లైన్ నిర్మాణ పనులు నత్తన నడకన సాగుతుండటాన్ని గమనించిన ఆయ న సంబంధిత అధికారులపై తీవ్ర స్థా యిలో మండిపడ్డారు. చాలా పనులు గుత్తేదారులకు అప్పగించాల్సిన వైనా న్ని కూడా ఆయన గుర్తించారు. ఇప్పటి వరకు గుత్తేదారులకు ఎందుకు పను లు అప్పగించలేదని మున్సిపల్ ఇంజనీర్ కామేశ్వరరావును నిలదీశారు. అమృత్ పథకం కింద ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అనంతరం పురపాలక సంఘ కార్యాలయానికి వచ్చిన పాండురంగారావును మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ కలిసి అభినందనలు తెలిపారు. అమృత్ పథకం కింద రిజర్వాయర్లు, పైప్‌లైన్ నిర్మాణాలకు త్వరితగతిన మంజూరు ఉత్తర్వులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.