Others

రామాయణ రత్నకోశంలో ‘ధర్మచక్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మచక్రం
వాల్మీకి రామాయణ సంగ్రహ స్వరూపము

రచన: బసవరాజు నరసింహారావు
వెల: రూ.200/-లు
ప్రతుల ప్రాప్తిస్థానం
ప్లాట్‌నెం. 88, రోడ్‌నెం. 1
న్యూనాగోల్ కాలనీ, సరూర్ నగర్ పోస్టు
హైదరాబాద్ - 500035,
చరవాణి నెం. 9490942629

ఆదికవి వాల్మీకి వేదానే్న రామాయణ కావ్యరూపంగా మార్చారని వేదాంతులు చెబుతారు. రామాయణమనే మహాసముద్రంలో వెతుక్కున్నవారికి వెతుక్కునన్ని రత్నాలు చిక్కుతాయి.వాల్మీకి రామాయణాన్ని అనుసృజించని కవి లేడు అంటే అతిశయం కాదు. సాహితీ ప్రక్రియలన్నింటా రామాయణం నెలకొని ఉంది.
రాముడు ధర్మస్వరూపుడు. రామోవిగ్రహాన్ ధర్మః అన్నారు కదా. పోతపోసిన ధర్మమే రాముడు. ఆ రాముడు చరించిన పద్ధతిలో కలియుగంలోనివారు చరిస్తే తిరిగి రామరాజ్యం వస్తుందని ప్రగాఢంగా నమ్మేవారి సంఖ్యబహుళమే. అట్లాంటివారిలో బసవరాజు నరసింహారావుగారొకరు. వీరు రామాయణాన్ని చదివి తనదైన కోణంలో ఆలోచించి చివరకు వాల్మీకి పెట్టిన కాండాలకే ‘‘మహర్షి-బ్రహ్మర్షి’’, ‘్భరతుడు’, ‘‘దుష్టశిక్షణ -శిష్టరక్షణ’’, ‘‘సత్యాంగత్య ప్రభావము’’, ‘‘ఆచార్య వైభవము’’, ‘్ధర్మవిజయము’ బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధకాండాలకే అనే పేర్లు పెట్టి వివిధ రామాయణాలతో తులనాత్మక పరిశీలన చేసి భగవంతుడైన కృష్ణుని వృత్తాంతాన్ని చదివి అందులోని కృష్ణుడు చెప్పిన ధర్మాన్ని అనుసరిస్తూ రాముడు ఆచరించి చూపిన ధర్మాన్ని విశే్లషణాపూర్వకంగా సామాన్యులకు కూడా అర్థమయ్యేవిధంగా ‘‘్ధర్మచక్రం’’ అన్న పేరిట 420 పేజీలకు పైగా రచించారు. ఈ పెద్ద గ్రంథం సులభ పఠనశైలిలో ఉంది. శబ్దాండబరాలకు విలువ ఇవ్వకుండా చిన్నచిన్న పదాలతోనే అల్పాక్షరాలతోనే అనల్పమైన అర్థాలను ఇచ్చారు. సత్సాంగత్యం తర్వాతనే సద్గురువు లభ్యమవుతాడనే గూడార్థంతోనే సుందరకాండకు ఆచార్య వైభవం అన్న పేరిడినట్లు చదువరికి అనిపిస్తుంది. వెంకట సత్యనారాయణ శాస్ర్తీ అభినందన చందనం అద్దుతూ ఇలా అన్నారు. సీతానే్వషణ లో రామలక్ష్మణుల వాదంలోకూడా గూడార్థాలున్నాయి. రాముడు సీత దూరమైనందున బాధగా ఉంది అని చెప్పడంలోను సీ తా రా మ అన్న అక్షరాల్లోనే సీ, మ అనే వాటిని దూరం చేస్తే తార అన్నపదం ఏర్పడుతుంది. తారా అంటే తరింపచేయుట అంటే మ= నా యొక్క, సీ= ప్రియమైన సఖి సీత దూరమైనచో తరింపజేయుటెట్లు? ఇది దుఃఖ కారణం కదా. రాముడు జనాభిరాముడు కనుక జనులకేవిధంగా మేలుజరుగుతుందో దానే్న చేసేవాడు కనుక ఇక్కడ రాముడు దుఃఖాన్ని దూరం చేసుకోవాలి అంటే ఏం చేయాలని లక్ష్మణుని కోరితే ఆ లక్ష్మన్న వెతికి చూడాలి అన్నాడు. అంటే భాగవతంలో ప్రహ్లాదుడు తండ్రి శ్రీహరి ఎక్కడ ఎక్కడ? అని అరుస్తూ ఇక్కడున్నాడా? అక్కడున్నాడా? అని అడిగినప్పుడు ఇందు గలడుఅందులేడని చక్రి.. ఎందెందు వెదికి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే ... అన్నట్లుగా నీవు వెతకడం మొదలు పెట్టు అపుడు నీకు భగవంతుడు కన్ను ఎదుటనే కనిపిస్తాడు. నీలోనే దైవాన్ని పెట్టుకొని ప్రపంచమంతా ఎక్కడ ఎక్కడా అని వెతనక్కర్లేదు. ఆ దైవం ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్లడానికి మార్గం కావాలంటే ఆచార్యుని కృప కలుగాలి. ఆచార్యుని వైభవంతో అనే్వషణ పూర్తి అవుతుంది అని చెప్పారు.
అట్లానే ఈ బసవరాజు నరసింహారావు గారు తెలిసిన రామాయణానే్న సామాన్యులకు అసామాన్యులకు గూడా ఆసక్తి కలిగించేవిధంగా రాముని ధర్మచక్రాన్ని రచించి చూపారు. ఈ చదివితే రామాయణంలోని అనర్ఘమైన రత్నాలు అరచేతిలోవైకుంఠాన్ని దర్శింపచేస్తుంది.
తతో రావణ నీతాయాః సీతా యాశ్శత్రు కర్శనః అన్న శ్లోకం ప్రాచుర్యం పొందడానికి , అందరూ జపించడానికి కారణం ఇందులో ‘‘త’’అనే బీజాక్షరం ఉండడమేనని చెప్తారు. అట్లానే అశోకవనంలో ఉన్న సీతమ్మకు రావణుడు ఎన్నో ప్రలోభాలు పెడుతాడు. అవన్నీ కూడా నేడు ప్రపంచంలో కనిపించే అల్పకాల వైభోగాలు. వాటి వెంట మనం పరుగెత్తకుండా శాశ్వతానందం కావాలంటే విద్యారణ్య భగవాన్ ‘‘యేకామాస్తు త్వయా లబ్దాః
దత్తాన్విద్ధిమయైవతాన్ ....’’అన్న శ్లోకంలో నీవనుభవించెడు సర్వకామములనూ పరమాత్ముడనైన నేనొసంగినవే యని గుర్తించుము. నీ కామములను పూరించుచున్న నన్ను సర్వకాలం స్మరించము. అని చెప్పిన ఈ భావంతో సరిపోల్చుకోవలసిన అవసరం ఉన్నదని చెప్తారు. గీతాచార్యుడు కూడా సర్వానికి అధీశ్వరుడనునేనే. నీవు నన్ను నమ్మి సర్వానికి కారణాకారుడని నేను అని నీవు విశ్వసించి నిమిత్తమాత్రుడుగా ఉంటే నీకు ఈ విషయవాసనలు అంటవు అని కదా చెప్పాడు. అట్లానే రామాయణంలోను రావణువంటి అల్పప్రయోజనాలు అప్రయోజనాల వెంట పడకుండా సీతారాములనే సత్యాధర్మాలను పట్టుకొంటే జీవితం ధన్యవౌతుందని శాశ్వతమైన ప్రయోజనం కలుగాలంటే కేవలం రాముని ఆచరణనే మనమూ ఆచరించాలని ఈ ‘‘్ధర్మచక్రం’’ చెబుతోంది. దీన్ని చదివి అందరూ ధర్మసూక్ష్మాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలుసుకోవచ్చు. సాహితీలోకంలో వచ్చిన ఈ ‘్ధర్మచక్రం’ ఆహ్వానించి ఆదరించాల్సిన గ్రంథమే నని పాఠకునికి అనిపిస్తుంది.

- ఆర్. పురంధర్