సంపాదకీయం

తెలుగు రాష్ట్రాల సభాపర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు తెలుగు రాష్ట్రాల సభాపర్వాలు ప్రారంభంకాబోతున్నాయి. అంతా ఉత్కంఠ. సుమారు ఐదురోజుల తేడాతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభం కానుండగా, 10న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 6న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ‘మమ’ అననున్నారు. ఈ నెలాఖరులోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ బడ్జెట్‌ను ఆమోదించుకోనిపక్షంలో ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు నిలిచిపోతాయి. వారం రోజుల్లోనే గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది. 5వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. 5వ తేదీ శనివారం కావడం వల్ల గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయి. 7,8,9 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం ముగుస్తుంది. ఆ తర్వాత 10న ఏపి రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీ ఆమోదం కోసం రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2016- 17) వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
అదే రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఒకవైపు ఏపి అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రాతిపాదించడం, మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు గవర్నర్ నరసింహన్ అసెంబ్లీకి చేరుకోనుండడంతో ఆ రోజున అసెంబ్లీ ప్రాంగణం కిటకిటలాడనుంది. ఏపి అసెంబ్లీ సమావేశాలను తొలుత విజయవాడలో నిర్వహించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం భావించింది. కానీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకెళ్ళడం సాధ్యం కాదని భావించి, చివరకు హైదరాబాద్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత ఫిబ్రవరి 27 నుంచి నిర్వహించాలని, ఆ తర్వాత కాదు 29 నుంచి ప్రారంభించాలని, మార్చి 2 నుంచి అని ఇలా వేర్వేరు తేదీలు అనుకుని చివరకు 5 నుంచి ప్రారంభించేందకు సంకల్పించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా తొలుత జనవరి 27 నుంచే సమావేశాలను ప్రారంభించాలని భావించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకావడానికి ముందే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలనుకున్నారు. జనవరిలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడం గతంలో ఎప్పుడూ లేదు. కానీ ఫిబ్రవరి 2న జిహెచ్‌ఎంసి ఎన్నికలు ఉండడం, ఆ తర్వాత మేయర్ ఎన్నిక, నారాయణ్ ఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఇలా వేర్వేరు కారణాలతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఒకే ప్రాంగణంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ భవనాలు ఉండడం వల్ల కొంత చిక్కు ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకోవడానికి రెండు వేర్వేరు అసెంబ్లీ భవనాలు ఉన్నాయి. కానీ ఆవరణ చాలా చిన్నగా ఉండడం వల్లే సమస్య. ఎందుకంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, ఎపి నుంచి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రా ల హోం మంత్రుల భారీ కాన్వాయ్‌లు, మిగతా మంత్రు ల, ఎమ్మెల్యేల వాహనాల రాకపోకలతో ఆవరణ ఊహించని విధంగా కిటకిటలాడనున్నది. ఇన్ని వాహనాలకు పార్కింగ్ చూపించడం, ఆవరణలో ‘జామ్’ కాకుండా చూడడం పోలీసులకు పెద్ద సమస్య. పైగా ఇరు రాష్ట్రాలకు చెందిన విపక్షాల సభ్యులు వివిధ కారణాలతో సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చిన సభ్యులు లేదా సభ నుంచి సస్పెండైన సభ్యులు ఆవరణలో (ఒక్కోసారి) నిరసన ధర్నాలకు ఉపక్రమిస్తుంటారు. ఇది మరీ ఇబ్బందికరమైన సమస్యగా మారుతుంది. ఇది కూడా పోలీసుల (మార్షల్స్)కు పెద్ద తలనొప్పిగా మారనున్నది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల బందోబస్తుకు ఆ రాష్ట్రం నుంచే పోలీసులు వస్తారు. భద్రతా ఏర్పాట్లకు సొంత రాష్ట్రం పోలీసులనే ఉపయోగించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర డిజిపిని లోగడ ఆదేశించారు.
ఇక రెండు రాష్టాల అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయన్నదే అందరిలోనూ ఉత్కంఠ. ఎందుకంటే గత సమావేశాలకు, ఈ సమావేశాలకు మధ్య భారీగా మార్పులు జరిగాయి. ప్రతిపక్షాల నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అధికార పార్టీల్లోకి చేరారు. ఒక ఎమ్మెల్యే అయితే టిడిపి కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు పక్కనే కూర్చుని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శించి, సమావేశం ముగియగానే వేదిక దిగి నేరుగా రాష్ట్ర మంత్రులు కెటిఆర్, టి. హరీష్‌రావును కలిసి టిఆర్‌ఎస్‌లో చేరడంతో మొత్తం టిడిపినే కుదిపేసింది, పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, వారిలో ఇప్పటికే 10 మంది టిఆర్‌ఎస్‌లో చేరి పోయారు. దీంతో రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద రెండింట మూడో వంతు మంది ఎమ్మెల్యేలు కోరుతున్న విధంగా టిఆర్‌ఎస్‌లో తమను విలీనం చేస్తున్నట్లుగా గుర్తించాలని కోరారు. కాగా ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటీషన్లు స్పీకర్ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో స్పీకర్ మధుసూదనాచారి సమావేశాలు ప్రారంభించడానికి ముందుగా విలీనంపై నిర్ణయం తీసుకుంటారా? లేక ఫిరాయింపులపై నిర్ణయం తీసుకుంటారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఈ సమస్య ఆంధ్రలోనూ ఉంది. టిడిపిలోకి వైకాపా నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆగ్రహంగా ఉన్న వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు సమాయత్తమయ్యారు. ఇలా రెండు రాష్ట్రాల సభాపర్వాల ముందు అనేక సమస్యలు ఉన్నందున సాఫీగా సాగేనా?..వేచి చూద్దాం.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి