జాతీయ వార్తలు

రఫేల్ కేసులో కేంద్రానికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కేసులో కేంద్రానికి ఊరట లభించింది. ఈ వ్యవహారంపై గతంలో ఇచ్చిన సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లు విస్తత్ర ధర్మాసనం కొట్టవేసింది. దీనిపై మళ్లీ సమీక్ష చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కేంద్రం కొనుగోలు చేసింది. కాగా ఈ యుద్ధ విమానాలకు సంబంధించి రూ.59,000 కోట్ల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగాయని గతంలో 14 పిటిషన్లు దాఖలు కాగా వాటన్నింటిన కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. ఈ తీర్పును పునఃసమీక్ష జరపాలని కేంద్ర మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరి, సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్వవహారంలో కేంద్రం పలు కీలక విషయాలను కోర్టుకు చెప్పకుండా దాచిపెట్టిందని వారు ఆరోపించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు గత మేలో తీర్పును రిజర్వ్‌లో పెట్టగా నేడు తీర్పునిచ్చింది.