జాతీయ వార్తలు

రఫేల్‌పై రివ్యూ పిటిషన్లను విచారిస్తాం:సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు పేర్కొంది. జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అనుమానించదగ్గ విషయాలు లేవని, ఈ యుద్ధ విమానాల ఆవశ్యకత, నాణ్యతపై ఎలాంటి అనుమానాలు వద్దని, అలాగే ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అంశాలు కూడా లేవని సుప్రీం కోర్టు తీర్పునిస్తూ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. అయితే ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై తక్షణమే విచారణ చేపట్టాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఈ రివ్యూ పిటిషన్లను విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేయవలసి ఉందని జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.