ఆటాపోటీ

అభిమానుల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాకర్, రగ్బీ వంటి క్రీడలకు పరిమితమైన వీరాభిమానం ఇప్పుడు క్రికెట్‌కు కూడా వ్యాపించింది. అయితే, చాలా దేశాల్లో జట్లకు అభిమానులుంటే, మన దేశంలో ఆటగాళ్లకు ఉన్నారు. క్రికెట్‌లో బ్యాటింగ్ అంటే ముందుగా ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ గుర్తుకొస్తాడు. సచిన్‌కు వచ్చినంత పేరు ప్రఖ్యాతుల్ని అతని వీరాభిమాని సుధీర్ గౌతం చౌదరి కూడా సంపాదించుకోవడం విశేషం. గుండు కొట్టించుకొని, ఒంటిపై త్రివర్ణ పతాక రంగులను దిద్దుకొని, భారీ జెండాను చేతపట్టుకొని స్టేడియంలో కేరింతలు కొట్టే సుధీర్ చాలా మందికి సుపరచితుడే. గత ఏడాది జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌సహా పలు విదేశాల్లో జరిగిన వివిధ టోర్నీలకు కూడా సుధీర్ హాజరయ్యాడు. అందుకయ్యే ఖర్చు మొత్తాన్ని సచిన్ భరించాడు. సుధీర్‌కు భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లేటంత చనువు ఏర్పడింది. సుధీర్ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు ‘జార్ఖండ్ డైనమైట్’ మహేంద్ర సింగ్ ధోనీ అభిమాని రాంబాబు.
మొహాలీ మ్యాచ్‌లో సుధీర్‌తోపాటు రాంబాబు కూడా కనిపించాడు. ‘్భరత్ మాతాకీ జై’ అంటూ రాంబాబు నినాదాలు చేస్తుంటగా, సుధీర్ కూడా అతనితో జత కలిశాడు. జాతీయ పతకాన్ని ఊపుతూ, భారత ఆటగాళ్ల ప్రోత్సహిస్తూ ఇద్దరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘మిస్ యు ధోనీ’ అని ఛాతీపై రాయించుకున్న రాంబాబు తొలి రోజు ఆట ముగిసిన తర్వాత తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ తాను ధోనీ అభిమానని చెప్పాడు. ధోనీతో తనకు పరిచయం ఉందని, దేశంలో జరిగే టి-20, వనే్డ, టెస్టు మ్యాచ్‌లను చూసేందుకు అవసరమైన ఖర్చులను అతనే భరిస్తున్నాడని చెప్పాడు. ధోనీతో కలవడం, అతనితో మాట్లాడడం తనకు ఎంతో ఇష్టమన్నాడు. మ్యాచ్‌లకు హాజరై, భారత జట్టు విజయాలు సాధిస్తుంటే ఎంతో ఆనందిస్తానని రాంబాబు అన్నాడు. మొహాలీ టెస్టులో భారత్‌దే విజయమని జోస్యం చెప్పాడు. సుధీర్ అడుగుజాడల్లో రాంబాబు నడుస్తుంటే, వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకెంత మంది ఈ విధంగా ఒక ఆటగాడికి అభినులుగా మారుతారో చూడాలి.